బిగ్ బాస్ సిరి.. శ్రీహాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరూ కూడా యూట్యూబర్సే.. అలాగే ఇద్దరూ కూడా బిగ్ బాస్ షోలో మరింత పాపులారిటీ దక్కించుకున్న వాళ్లే గత కొద్ది రోజులుగా ఫ్రెండ్స్ అయిన వీరిద్దరూ ఆ తర్వాత ప్రేమలో పడి ప్రేమించుకుంటున్నారు. అంతేకాదు ఒక బాలుడిని దత్తత తీసుకొని లివింగ్ రిలేషన్ చేస్తున్నారు. బిగ్ బాస్ నుంచి శ్రీహన్ బయటకు వచ్చేసిన తర్వాత సోషల్ మీడియా అంతా వీళ్ళదే అన్నట్టు తెగ పోస్టు కూడా పెట్టేస్తున్నారు. అభిమానులను అలరిస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే ఒక నెటిజన్ మీ పెళ్లి ఎప్పుడు అని అడగగా సిరి క్లారిటీ ఇచ్చేసింది.
అసలు విషయానికి వస్తే.. సిరి యూట్యూబర్ గా బాగానే తెలుసు. శ్రీహాన్ తో కూడా ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ చేసింది. బిగ్ బాస్ 5వ సీజన్లో వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ గా టాప్ ఫైవ్ లో నిలిచి పోటీ పడింది. కానీ ఆ సీజన్లో షణ్ముఖ్ తో రాసుకుపోసుకు తిరగడం వల్ల నెగటివ్ కామెంట్లు కూడా పొందింది. అయితే అదంతా షో కోసం చేసిన హంగామా అని తర్వాత తెలిసి అందరూ రిలాక్స్ అయిపోయారు. ఇక ఆ సీజన్ లో ఆమెకు సపోర్ట్ చేయడానికి శ్రీహన్ బిగ్ బాస్ కి కూడా వచ్చాడు. సీజన్లో శ్రీహాన్ ఓ కంటెస్టెంట్ గా ఆడాడు. తన గేమ్ తో చివరి వరకు వెళ్లి రూ.40 లక్షలు తీసుకొని గేమ్ నుంచి ఎగ్జిట్ అయిపోవడం రేవంత్ విన్నర్ గా నిలవడం జరిగింది.
తాజాగా జరిగిన సిరి బర్తడే ని శ్రీహాన్ గ్రాండ్ గా జరిపాడు. డైమండ్ రింగ్ గిఫ్ట్ గా ఇచ్చాడు. ఈ క్రమంలోనే తన ఫాలోవర్స్ తో తిరిగి ముచ్చట పెట్టుకోగా.. అందులో నుంచి ఓ నెటిజన్ పెళ్లెప్పుడు అని అడగగా.. ఎప్పుడు అనే విషయంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. మరి ఎప్పుడు చేసుకుంటారు అనేది చెప్పలేదు కానీ త్వరలో చేసుకుంటామనేది చెప్పేసింది. మరి వీరిద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో చూడాలి.
View this post on Instagram