అమెజాన్, నెట్ ఫ్లిక్స్ ఉచిత సబ్ స్క్రిప్షన్ కోసం ఏం చెయ్యాలంటే?

-

అమెజాన్, నెట్ ఫ్లిక్స్ ఉచిత సబ్ స్క్రిప్షన్ అనేది అందరికి కాదు కేవలం జియో కస్టమర్లకు మాత్రమే..జియో అందిస్తున్న కొన్ని ప్లాన్లను ఎంచుకుంటే వాటితో పాటు అమెజాన్, నెట్ ఫ్లిక్స్ ను ఉచితంగా పొందవచ్చు..ఇకపోతే అయితే, ఇది ప్రీపెయిడ్ వాళ్ళకి కాదు, ఈ సర్వీస్ ను కేవలం పోస్ట్ పైడ్ వారికి మాత్రమే అఫర్ చేస్తోంది. కాగా ఈ ప్లాన్స్ రూ.399 రూపాయల నుండి ఆరంభం కానున్నాయి. జియో యొక్క ఈ పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ వలన కస్టమర్లు నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో OTTలలో కంటెంట్ ను ఉచితంగా తిలకించవచ్చు. జియో అఫర్ చేస్తున్న ఈ ప్లాన్స్ పోస్ట్ పైడ్ ప్లాన్స్ మరియు ప్రయోజనాలు ప్రీపెయిడ్ కస్టమర్లకు వర్తించవు అని గుర్తు పెట్టుకోవాలి..

రూ.399 ప్లాన్ బెస్ట్ అని చెప్పొచ్చు. ఈ ప్లాన్ అధిక డేటా అన్లిమిటెడ్ కాలింగ్ తో పాటు మరెన్నో బెనిఫిట్స్ ఉన్నాయి..పోస్ట్పెయిడ్ ప్లాన్ ఒక నెల రెంటల్ ప్లాన్ మరియు ఇది బిల్ వ్యవధికి గాను 75 జిబి హై స్పీడ్ డేటాని వినియోగదారులకు అందిస్తుంది. అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 మెసెజ్‌లు లిమిట్ కూడా ఈ ప్లాన్ లో ఒక భాగం. ఈ ప్లాన్ తో అమెజాన్, నెట్ ఫ్లిక్స్ ఉచిత సబ్ స్క్రిప్షన్ ను పొందవచ్చు..

దాంతో పాటు 200 జిబి వరకు డేటాని రోల్ అవుట్ కూడా ఈ ప్లాన్ ద్వారా చేసుకోవచ్చు. ఇదే లాభాలను అఫర్ చేసే మరొక 2 ప్లాన్స్ ని కూడా అందించింది. ఇవి మీ ఫ్యామిలీ ప్లాన్స్ మరియు ఈ ప్లాన్స్ మీకు అధనపు SIM కార్డ్ ను కూడా తీసుకు వస్తాయి. అందులో… ఒకటి రూ.599 పోస్ట్పెయిడ్ ప్లాన్ మరియు మరొకటి రూ.799 పోస్ట్పెయిడ్ ప్లాన్. వీటిలో రూ.599 ప్లాన్ 1 సిమ్ కార్డ్ తో వస్తుంది. రూ.799 పోస్ట్పెయిడ్ ప్లాన్ మాత్రం 2 అదనపు సిమ్ కార్డ్ లను తీసుకువస్తుంది..ఎటువంటి ప్లాను కావాలో ముందే ఎంపిక చేసుకొని సంక్రాంతిని మరింత ఖుషిగా జరుపుకోండి..

Read more RELATED
Recommended to you

Latest news