బిగ్ బాస్ నాలుగవ సీజన్లో ఐదవ ఎలిమినేషన్ గా సుజాత ఇంటి నుండి బయటకి వెళ్ళిపోయింది. ఆదివారం ఎపిసోడ్ లో భాగంగా కంటెస్టెంట్స్ అందరికీ ఫన్ టాస్క్ ఇచ్చిన నాగార్జున ప్రేక్షకులని బాగా ఎంటర్ టైన్ చేసాడు. మాట మాట్లాడకుండా కేవలం సైగలతో మాత్రమే సినిమా పేరు చెప్పమని చెప్పి అందరినీ నవ్వించాడు. ఫన్ టాస్క్ ముగిసిన అనంతరం ఎలిమినేషన్ టైమ్ వచ్చేసింది. నామినేషన్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరుగా సేవ్ అవుతూ వస్తుండడంతో చివర్లో అమ్మరాజశేఖర్, సుజాత ఇద్దరే మిగిలారు.
వారిద్దరిలో నుండి సుజాత ఇంటి నుండి బయటకి వెళ్ళిపోయింది. ఎలిమినేట్ అయ్యాక సుజాత చాలా హుందాగా ప్రవర్తించింది. హౌస్ లోకి వస్తున్నప్పుడు ఎంత ఎనర్జీ కనిపించిందో ఎలిమినేట్ అయ్యి నాగార్జున గారి దగ్గరికి వచ్చేసరికి అంతే ఎనర్జీతో నిలబడింది. ఎలిమినేట్ అవుతానని ఊహించకపోవడంతో కొంత షాకింగ్ గా ఉందని, అయినా ఫర్వాలేదని చాలా స్పోర్టివ్ గా తీసుకుంది. హౌస్ లో ఉన్నవాళ్లలో తనని బాధ పెట్టిందెవరని నాగార్జున గారు అడగ్గా, మొదట్ అభిజిత్ పేరు చెప్పింది. ఇంకా అమ్మ రాజశేఖర్ కూడా అని తెలిపింది.
ఐతే ఎలిమినేట్ అయిన వారు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లకి బిగ్ బాంగ్ వేయడం ఆనవాయితీ. అందులో భాగంగా సుజాత, సోహైల్ పై బిగ్ బాంగ్ వేసింది. కెప్టెన్ అయిన సోహైల్ ఈ వారం మొత్తం బాసాన్లు తోమాలాని ఆ బిగ్ బాంబ్ ఉద్దేశ్యం. ఐతే కెప్టెన్ ఇవన్నీ చేస్తారా అంటూ సోహైల్ కొంత అడ్డు చెప్పినప్పటికీ, నాగార్జున గారు కల్పించుకుని కెప్టెన్సీ అనేది నామినేషన్స్ నుండి ఇమ్యూనిటీ పొందడానికే అనీ, బిగ్ బాంగ్ ఎవరి మీదనైనా వేయచ్చని తెలిపాడు. మొత్తానికి సుజాత సోహైల్ ని భలే ఇరికించింది. కెప్టెన్ హోదాలో ఉండి కూడా బాసాన్లు తోమే మొదటి కెప్టెన్ సోహైల్ అవుతాడేమో..!