బిగ్ బాస్: 10 వ వారం ఎలిమినేట్ అయ్యేది వీరే..!

-

ఎట్టకేలకు బిగ్ బాస్ ఆరవ సీజన్లో తొమ్మిది వారాలు దిగ్విజయంగా పూర్తయ్యాయి. అయితే ఊహించని విధంగా 9వ వారం టైటిల్ విన్నర్ కైవసం చేసుకుంటుందనుకున్న గీతూ రాయల్ ను పంపించేయడం చాలా ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ క్రమంలోనే ఇప్పుడు పదోవారానికి సంబంధించిన నామినేషన్ లిస్ట్ కూడా లీక్ అయ్యింది. ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ లోకి 21 మంది కంటెస్టెంట్లు రాగా వారిలో తొమ్మిది మంది ఎలిమినేట్ అయ్యారు. 9వ వారం గీతు కూడా వెళ్లిపోవడంతో పదో వారం నామినేషన్స్ టాస్క్ మీద అందరూ దృష్టి సారించారని చెప్పాలి . గతంలో మాదిరిగా బిగ్ బాస్ ఆరో సీజన్ లో కూడా నామినేషన్ టాస్క్ లు ఎంతో రచ్చ రచ్చగా సాగుతున్నాయి.

ప్రతివారం కంటెస్టెంట్ల మధ్య గొడవలు తారస్థాయికి చేరుకుంటున్నాయి. అంతేకాదు కొంతమంది మధ్య దూరం కూడా పెరిగిపోయిందనే చెప్పాలి . ఈ క్రమంలోనే నామినేషన్ టాస్క్ లో కంటెస్టెంట్లు నామినేట్ చేసే వాళ్ళ ముఖాలపై నీళ్లు కొట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇనయ సుల్తానాను కొందరు కంటెస్టెంట్లు టార్గెట్ చేశారు. దీంతో ఆమె వాళ్ళతో గొడవ పెట్టుకుంది. అలాగే రేవంత్ – ఇనయా , ఆదిరెడ్డి – ఇనయా మధ్య కూడా పెద్ద పెద్ద వాగ్వాదాలు జరిగినట్లు తెలుస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఏకంగా 9 మంది నామినేట్ అయ్యారని తెలుస్తోంది.

అందులో ఇనయా, శ్రీహాన్, బాలాదిత్య , రేవంత్, కీర్తి, మెరీనా , వాసంతి కృష్ణన్, ఆదిరెడ్డి , ఫైమాలు నామినేషన్ లో ఉన్నట్లు ఒక వార్త తాజాగా లీక్ అయ్యింది. ఇప్పుడు 9 మంది ఎలిమినేట్ అవ్వడంతో 12 మంది మిగిలారు. అలాంటిది ఈ వారం 9 మంది నామినేషన్ లోకి రావడంతో శ్రీ సత్యతో పాటు రోహిత్, రాజశేఖర్లు మాత్రమే సేఫ్ అయ్యారని చెప్పాలి. ప్రస్తుతం ఇనయాను టార్గెట్ చేశారు కాబట్టి పదోవారం ఈమె ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఎలిమినేషన్ వీక్ వచ్చేవరకు ఎవరు ఎలిమినేట్ అయ్యారో తెలుసుకోవాలంటే ఎదురు చూడక తప్పదు.

Read more RELATED
Recommended to you

Latest news