బుల్లితెరపై రియాలిటీ షో లలో ఒకటైన బిగ్ బాస్ షో కు ప్రత్యేకమైన స్థానం ఉన్నది. బిగ్ బాస్ షోకు విజేతగా నిలిస్తే ఆ కంటెస్టెంట్ కు ఆ తర్వాత వరుస అవకాశాలు వెలువడతాయని ఇండస్ట్రీలో ఎంతో మంది భావిస్తూ ఉంటారు. అయితే ఇప్పటి వరకు గెలిచిన వారందరూ ఏ పొజిషన్ లో ఉన్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
1). మొదటి విన్నర్ శివ బాలాజీ:బిగ్ బాస్ మొదటి సీజన్ లో ఎవరూ ఊహించని విధంగా టైటిల్ ను సొంతం చేసుకున్నారు శివబాలాజీ. అయితే ప్రైజ్ మనీ భారీగానే సొంతం చేసుకున్నప్పటికీ ఆ తర్వాత పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు.
2). రెండవ విన్నర్ కౌశల్ మండా:రెండో సీజన్లో కౌశల్ మండ భారీ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. అతనికి వచ్చిన ఫ్యాన్ ఫాలోయింగ్ కారణంగానే విన్నర్ గా గెలిచాడు .కానీ ఆ తర్వాత ఇండస్ట్రీలో హీరో గా నిలదొక్కుకోలేకపోయాడు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూన్నా అవకాశాలు రాలేదు.
3). రాహుల్ సిప్లిగంజ్:ఇక మూడవ సీజన్ లో రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ విన్నర్ గా నిలవగా.. బిగ్ బాస్ హౌస్ నుండి రాకముందు మంచి క్రేజ్ ఉంది. అలా సినిమాల్లో పాడే అవకాశాలు కూడా వచ్చాయి. బిగ్బాస్ గెలిచిన తర్వాత తన కెరియర్ లో ఎలాంటి వండర్ జరగలేదు.
4). అభిజిత్:ఇక నాలుగో సీజన్ లో అభిజిత్ కూడా భారీ స్థాయిలో క్రేజ్ సంపాదించి టైటిల్ విన్నర్ గా నిలిచాడు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆ తరువాత బిగ్ బాస్ షో ద్వారా పాపులారిటీ సంపాదిస్తారు అనుకున్నారు కానీ ఆ షో వల్ల ఎలాంటి లాభం లేకపోయింది.
5). విజే సన్నీ:ఐదవ సీజన్ లో ఎవరూ ఊహించని విధంగా విజయాన్ని గెలిచారు.. అదృష్టవశాత్తు టైటిల్ గెలిచిన ఈయన ఆ తర్వాత హీరోగా కూడా ప్రయత్నాలు చేసినా అవి ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు.
6). బిందు మాధవి:ఈ తరహా లో ఇప్పటి వరకు ఐదు సీజన్ లలో గెలిచిన వారంతా బిగ్బాస్ ద్వారా వారి జీవితాలు మారతాయి అనుకున్నారు కానీ అలాంటిదేమీ జరగలేదు. ఇప్పుడు బిగ్ బాస్-6 లో గెలిచిన బిందుమాధవి కూడా ఇండస్ట్రీలో ఎంతవరకు నిలదొక్కుకుంటుందో లేదో అనే విషయం ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా మారుతోంది.