ప్రియాంక జవాల్కర్‌ అందాన్ని తట్టుకోవడం కష్టమే..

-

ప్రముఖ నటి, ‘ట్యాక్సీవాలా’ ఫేమ్ ప్రియాంక జవాల్కర్ తన లేటెస్ట్ ఫోటోషూట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఓర చూపులతో… వయ్యారాలు ఒలకబోస్తూ ఆమె ఫోటోలకు పోజిచ్చారు. ప్రియాంక జవాల్కర్ ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

ప్రియాంక జవాల్కర్ మరాఠీ కుటుంబానికి చెందిన అమ్మాయి అయినప్పటికీ ఆమె పుట్టింది ఏపీలోని అనంతపురం జిల్లాలో. కంప్యూటర్ సైన్స్‌లో గ్రాడ్యుయేట్ అయిన జవాల్కర్.. ఆ తర్వాత మోడల్‌గా, నటిగా అడుగులు వేశారు.

2017లో వచ్చిన ‘కల వరం ఆయే’ సినిమాతో ప్రియాంక సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2018లో హీరో విజయ్ దేవరకొండ సరసన ‘ట్యాక్సీవాలా’ సినిమాలో ‌హీరోయిన్‌గా నటించారు. ట్యాక్సీవాలా సినిమాతో ప్రియాంక జవాల్కర్‌కు మంచి గుర్తింపు దక్కింది.

ఆ తర్వాత తెలుగులో ఆమెకు మరిన్ని అవకాశాలు వచ్చాయి. ప్రియాంక జవాల్కర్ గతేడాది రిలీజ్అయిన ఎస్ఆర్ కల్యాణ మండపం సినిమాతో ట్యాక్సీవాలా తర్వాత మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ ఏడాది గమనం సినిమాతో ప్రియాంక ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news