వాట్స్ ద సీక్రెట్ సిమ్రాన్..వన్నె తగ్గని అందం సీనియర్ హీరోయిన్ సొంతం

-

సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన హీరోయిన్ గా నటించిన బ్యూటిఫుల్ సిమ్రాన్..ప్రజెంట్ సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తోంది. తమిళ్ తో పాటు ఇతర భాషల్లో ఫుల్ బిజీగా ఉంది ఈ సీనియర్ హీరోయిన్.

సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన అప్ డేట్స్ ఇస్తుంటుంది సిమ్రాన్. కాగా, తాజాగా ట్విట్టర్ వేదికగా ఈ నటి షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడయాలో బాగా వైరలవుతున్నాయి. ఈ ఫొటోలు చూసి నెటిజన్లు..నాలుగు పదుల వయసు దాటినప్పటికీ సిమ్రాన్ ఇంకా అలాగే ఉందని అంటున్నారు.

46 ఏళ్ల వయసులోనూ 26 ఏళ్ల యువతిగా కనిపించడం వెనుక సిమ్రాన్ సీక్రెట్ ఏంటి? అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. సిమ్రాన్ తెలుగు ప్రేక్షకులకు చివరగా సూపర్ స్టార్ రజనీకాంత్ ‘పేటా’ చిత్రంలో కనిపించింది. సిమ్రాన్ నటించిన మాధవన్ ‘రాకెట్రీ’ ఫిల్మ్ త్వరలో రిలీజ్ కానుంది. ‘అంధాగన్’ చిత్రంలోనూ సీనియర్ నటి సిమ్రాన్ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ పిక్చర్ బాలీవుడ్ సూపర్ హిట్ ఫిల్మ్ ‘అంధాధున్’కు అఫీషియల్ తమిళ్ రీమేక్.

Read more RELATED
Recommended to you

Latest news