మల్టీ స్టారర్ మూవీ తో రానున్న బిగ్ బాస్ విన్నర్.. బడ్జెట్ ఎంత అంటే..?

-

దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న బెస్ట్ రియాల్టీ షో గా బిగ్ బాస్ మంచి ఇమేజ్ ను సొంతం చేసుకుంది. హిందీలో అయితే ఏకంగా 16 సీజన్ లకి పైగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తెలుగులో ఐదు సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకోవడమే కాదు ఊహించని విధంగా ఓటీటీ లో నాన్ స్టాప్ గా ప్రసారం చేసి మరింత ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం బిగ్బాస్ ఆరవ సీజన్ మొదలుకానుంది ఇది ఇలా ఉండగా బిగ్ బాస్ ద్వారా మంచి క్రేజ్ అందుకున్న వారిలో కొంతమంది ఇండస్ట్రీలో ఏదో ఒక రకంగా బిజీ అవుతుంటే అందులో టైటిల్ విన్నర్స్ కంటే మిగతా కంటెస్టెంట్లే ఎక్కువగా సినిమాలతో టీవీ షో లతో బిజీగా మారుతున్నారు.

బిగ్బాస్ తెలుగు సీజన్స్ లో ఇప్పటివరకు టైటిల్ విన్నర్ గా నిలిచిన ఏ ఒక్కరికి కూడా మరో రేంజ్కి తీసుకువెళ్లే విధంగా అవకాశాలు రాలేదు. ఇక అలా ఇప్పటివరకు శివ బాలాజీ , కౌశల్ మండ కూడా టైటిల్ విన్నర్స్ గా నిలిచినా.. వీరికి పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత రాహుల్ సిప్లిగంజ్ కూడా టైటిల్ విన్నర్ గా నిలిచినప్పటికీ సింగర్ గానే తన టాలెంట్ తో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక నాలుగవ సీజన్లో అభిజిత్ కూడా టైటిల్ విన్నర్ ను సొంతం చేసుకున్నప్పటికీ పెద్దగా అవకాశాలు రాలేదు. ఇక ఐదవ సీజన్లో సన్నీ పరిస్థితి కూడా అలాగే మారిపోయింది. కానీ ఇక తాజాగా సన్నాఫ్ ఇండియా డైరెక్టర్ తో మల్టీస్టారర్ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

నిన్నటి వరకు వీజే సన్ని పరిస్థితి ఇలాగే ఉండగా ఇప్పుడు మల్టీస్టారర్ మూవీ చేయడానికి సిద్ధమయ్యాడు ఇక ఈయన మరొక కమెడియన్, హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సప్తగిరి తో నటిస్తున్నాడు. సన్నాఫ్ ఇండియా తర్వాత రచయిత డైమండ్ రత్నబాబు చేస్తున్న సినిమా కావడంతో సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించి పోస్టర్ కూడా బాగా వైరల్ గా మారింది .ఇకపోతే ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియదు.. కానీ కామెడీ విషయంలో మాత్రం అన్ స్టాపబుల్ అని తెలుస్తోంది. ఈ సినిమాకు కేవలం రూ.3.5 కోట్ల బడ్జెట్ మాత్రమే పెడుతున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news