జయప్రకాష్ నారాయణ్ జన్మించిన పవిత్ర భూమి బీహార్ – సీఎం కేసీఆర్

-

గాల్వన్ లోయలో అసువులు బాసిన అమర సైనికుల కుటుంబాలకు, హైదరాబాద్ దుర్ఘటనలో మరణించిన కార్మికుల కుటుంబాలకు ప్రణామాలు తెలియజేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. అమరులైన సైనికుల కుటుంబాలకు సహాయం చేయాలని ఎంతో కాలంగా హృదయం భారంగా ఉండేది.. అందుకే పాట్నాకు వచ్చి ఈ పవిత్ర భూమి కి చెందిన అమరులైన సైనికులకు మా వంతు సహాయం చేస్తున్నామన్నారు.

“కోల్పోయిన ప్రాణాలను మేము తిరిగి తీసుకురాలేం. అమరులైన సైనికుల కుటుంబాలకు యావత్ దేశం అండగా ఉండాలనే సందేశం అందరికీ చేరాలి. దీంతో సైనికులకు, దేశ రక్షణ దళాలకు ఆత్మస్థైర్యం పెరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో అభివృద్ధి బాటలో సాగుతున్న యువ రాష్ట్రం.ఈ రాష్ట్రాభివృద్ధిలో బీహార్ కు చెందిన వేలమంది శ్రామికులు భాగస్వామ్యాన్ని అందిస్తున్నారు. వీరు ఎన్నో రంగాల్లో పని చేస్తున్నారు. గొప్ప ప్రభుత్వంగా చెప్పుకునే కేంద్ర ప్రభుత్వం కరోనా సమయంలో ప్రత్యేక రైళ్ళను నడపాలని కోరినా పట్టించుకోలేదు.

తెలంగాణ రాష్ట్రానికి వలస వచ్చిన బీహార్ రాష్ట్రం వారైనా, వేరే రాష్ట్రం వారైనా…. వారిని తెలంగాణ ప్రతినిధులుగా భావిస్తున్నామని నేను ఆ సమయంలో చెప్పాను. అందుకే వారి కష్టసుఖాల్లో పాలుపంచుకున్నాము. కరోనా సమయంలో ప్రత్యేక రైళ్ళను ఏర్పాటు చేసి ఎంతోమంది కార్మికులు, శ్రామికులను వారివారి రాష్ట్రాలకు తరలించాం.పని కోసం తెలంగాణకు వలస వచ్చిన వారందరికి మా రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం ఉందని మేమ భావిస్తున్నాం.

మేము గోదావరి నది ఒడ్డు నుండి గంగా నది ఒడ్డుకు వచ్చాం. గంగా నదిని పవిత్రనదిని భావించనట్లుగానే తెలంగాణలో గోదావరి నదిని దక్షిణ గంగగా భావిస్తాం. జయ ప్రకాశ్ నారాయణ్ జన్మించిన పవిత్ర భూమి బీహార్. బీహార్ ప్రజల చైతన్యంతో ప్రారంభమయ్యూ ప్రతీ మార్పు ఈ దేశంలో శాంతికి దారి తీసింది. బీహార్ లోని నలంద విశ్వవిద్యాలయం ఎంతో చారిత్రకమైంది. ఇక్కడికి వచ్చి ఈ పవిత్రమైన కార్యక్రమంలో పాలుపంచుకున్నందుకు సంతోషంగా ఉంది”. అన్నారు సీఎం కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news