Bimbisara review: కల్యాణ్​రామ్​ ‘బింబిసార’.. ఫ్యాన్స్​కు విజువల్​ ట్రీట్

-

త్రిగర్తల సామ్రాజ్యాధినేత బింబిసారుడిగా.. నందమూరి కల్యాణ్‌రామ్‌ నటించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘బింబిసార’. సోషియో ఫాంటసీ కథాంశంతో రూపుదిద్దుకున్న ఈ చిత్రం కల్యాణ్​ కెరీర్​లోనే భారీ స్థాయిలో నిర్మించబడింది. 500 ఏళ్ల క్రితం జరిగిన నిజమైన కథ ఆధారంగా టైం ట్రావెల్ పాయింట్​తో.. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్​పై కల్యాణ్ నిర్మించారు. వశిష్ట దశకత్వం వహించారు. కీరవాణి స్వరాలు సమకూర్చారు. కేథరిన్​, సంయుక్త మేనన్ హీరోయిన్​లుగా నటించారు. ఇప్పటికే విడుదలై టీజర్​, ట్రైలర్​తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా.. భారీ అంచనాలతో నేడు(శుక్రవారం) థియేటర్లలో భారీ స్థాయిలో విడుదలైంది. మరి ఈ మూవీ ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం.

సాధారణంగా తెలుగు ప్రేక్షకులకు సోషియో ఫాంటసీ సినిమాలు కొత్తేమి కాదు. సీనియర్ ఎన్టీఆర్ కాలం నుంచి బాహుబలి వరకు , మనం చాలా సోషియో-ఫాంటసీ చిత్రాలను చూశాం. అయితే బింబిసారాలో కొత్తగా అనిపించేది టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్. ఇది మాములు టైమ్ ట్రావెల్​లా కాకుండా, ఈ కథ సమాంతర ప్రపంచంలో నడుస్తుంది. ఇక్కడ రెండు టైమ్‌లైన్‌లతో సంబంధం లేదు కానీ దర్శకుడు దానిని ఎలా కనెక్ట్ చేశాడు అనేదే ప్రత్యేకం.

ఈ చిత్రం సాలిడ్ యాక్షన్ బ్లాక్‌తో బాగా మొదలైంది. బింబిసార ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. ఆ తర్వాత బింబిసార క్రూరత్వాన్ని చూపించడానికి దాదాపు 30 నిమిషాలు తీసుకున్నారు దర్శకుడు. క్రీస్తుపూర్వం 500 సంవత్సరాల క్రితం త్రిగర్తల సామ్రాజ్య అధినేత బిందుసారుడి పాత్రలో కల్యాణ్ రామ్ కనిపించారు. ఆయన ద్విపాత్రాభినయం బాగా చేశారు. డైలాగ్​ డెలీవరీ కూడా బాగుంది. అయితే విశ్వానందన్ వర్మ (ప్రకాష్ రాజ్) పాత్ర ప్రత్యేకంగా నిలుస్తుంది. సినిమా కథ మొత్తం బింబిసారుడి కాలం నుండి కలియుగంలోకి వచ్చి సంపాదించిన నిధిని ఎలా కాపాడుకుంటాడు అనేదాని చుట్టు తిరుగుతుంది.
అయితే ఫస్టాప్​ కాస్త స్లోగా అనిపించినా గ్రాఫిక్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి. ​ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. ఇక ఇంటర్వెల్ అయితే అదిరిపోయింది. సెకండాఫ్ కూడా ఆకట్టుకునే విధంగా ఉంది. ముఖ్యంగా సినిమాలో గ్రాఫిక్స్ ప్రేక్షకులను బింబిసార ప్రపంచంలోకి తీసుకెళ్తున్నాయి. ముఖ్యంగా కీరవాణి అందించిన సంగీతం ఈ సినిమాకు ప్లస్ అయ్యింది. సాంకేతికంగా చోటా కె నాయుడు విజువల్స్ బాగున్నాయి. నూతన దర్శకుడు అయినప్పటికీ వశిష్ట తన టాలెంట్​ను నిరూపించుకున్నాడు. ఈ సినిమా నందమూరి అభిమానులకు విజువల్ ఫీస్ట్ అనే చెప్పాలి.

చివరగా, బింబిసార అనేది అన్ని వర్గాల ప్రేక్షకులు చూడగలిగే మంచి సోషియో-ఫాంటసీ చిత్రం.

రేటింగ్: 3.0/5

Read more RELATED
Recommended to you

Latest news