తమిళ నాడు ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదం పై భారత ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మరణించిన సీడీఎస్ బిపిన్ రావత్ కు ఓ శాంతి అని పీఎం మోడీ నివాళ్లు అర్పించారు. అలాగే బిపిన్ రావత్ మరణం తనను బాగా కలిచి వేసిందని అన్నారు. బిపిన్ రావత్ దేశం కోసం ఎంతో సేవ చేశారని కొనియాడారు. సీ డీ ఎస్ బిపిన్ రావత్ ఒక అసాధారణ సైనికుడు అని అన్నారు. అలాగే రావత్ అసలైన దేశ భక్తుడని కొనియాడారు.
సాయుధ దళాల కోసం బిపిన్ రావత్ చాలా కష్ట పడ్డాడని అన్నారు. అలాగే సాయుధ దళాల ను.. భద్రతా యంత్రాంగా న్ని ఆధునికీరించడం లో బిపిన రావత్ పాత్ర మరవనిదని అన్నారు. అలాగే పలు క్లిష్ట మైన పరిస్థితులలో కూడా బిపిన్ రావత్ వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకునే వారని అన్నారు. అలాగే ఆయన దృష్టి అసాధారణ మైందని కొనియాడారు. ఆయన సేవలను దేశం మరవదని ట్విట్ చేశారు.
Gen Bipin Rawat was an outstanding soldier. A true patriot, he greatly contributed to modernising our armed forces and security apparatus. His insights and perspectives on strategic matters were exceptional. His passing away has saddened me deeply. Om Shanti. pic.twitter.com/YOuQvFT7Et
— Narendra Modi (@narendramodi) December 8, 2021