ఇటీవల తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోవడంతో తిరుపతి పార్లమెంట్ కు ఉప ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి ఏంటి అనే దానిపై ఎన్నికల సంఘం ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు. బీహార్ ఎన్నికలతో పాటుగా ఈ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. దీనితో అధికార విపక్షాలు ఇప్పుడు ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థుల వేట మొదలు పెట్టాయి.
ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జనసేన కలిపి పోటీ చేసే అవకాశం ఉంది. ఈమేరకు బలమైన నేతను నిలబెట్టేందుకు బిజెపి జనసేన కూటమి ప్రయత్నాలు చేస్తున్నాయి. 8 సార్లు తిరుపతి నుండి ఎంపీ గా పోటీ చేసి 7 సార్లు గెలిచిన మాజీ కేంద్రమంత్రి శ్రీ చింత మోహన్ గారు బీజేపీ లేదా జనసేన చేరి తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది.