గుంటూరు జిల్లాలో టీడీపీకి కాస్త పట్టున్న నియోజకవర్గాల్లో గురజాల కూడా ఒకటి. టీడీపీ ఆవిర్భావించక జరిగిన ఎన్నికల్లో ఇక్కడ పైచేయి ఆ పార్టీదే. 1983 నుంచి 2019 వరకు టీడీపీ నాలుగుసార్లు విజయం సాధించగా, కాంగ్రెస్ మూడుసార్లు, ఒకసారి ఇండిపెండెంట్, ఒకసారి వైసీపీ గెలిచింది. గురజాల నుంచి టీడీపీ తరుపున యరపతినేని శ్రీనివాసరావు మూడుసార్లు గెలిచారు. నియోజకవర్గ టీడీపీలో మూడున్నర దశాబ్దాలుగా ఆయనే తిరుగులేని నేత. 2009, 2014 ఎన్నికల్లో వరుసగా గెలిచిన ఆయన 2019 ఎన్నికల్లో జగన్ వేవ్‌లో యరపతినేని ఓటమి పాలయ్యారు. వైసీపీ నుంచి కాసు మహేష్ రెడ్డి విజయం సాధించారు.
పార్టీ అధికారంలోకి వచ్చాక 2014-19 మధ్య యరపతినేని కోట్లాది రూపాయలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. అయితే జగన్ వేవ్ బలంగా పనిచేయడంతోనే ఇక్కడ నాన్ లోకల్ అయిన కాసు మహేష్‌రెడ్డి గెలిచారు. అయితే ఎన్నికలైపోయి ఏడాది దాటేసింది. ఈ ఏడాది కాలంలో వైసీపీ ఎమ్మెల్యేకు మంచి మార్కులు ఏమి పడలేదని తెలుస్తోంది. కేవలం ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాల తప్పా, గురజాలకు పెద్దగా ఒరిగిందేమీ లేదని అర్ధమవుతుంది. పైగా గురజాలలో విచ్చలవిడిగా అక్రమాలు పెరిగిపోయాయని ప్రతిపక్ష నాయకులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. కేవలం ప్రతిపక్షమే కాకుండా కొన్ని వర్గాల ప్రజలు కూడా ఎమ్మెల్యే పట్ల అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది.
అక్రమ మైనింగ్, మద్యం, సారా వంటివి యధేచ్చగా సాగుతున్నాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక ఇసుకలో దోపిడి, ఇళ్ల పట్టాల్లో అక్రమాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయని అంటున్నారు. అసలు కరోనా సమయంలో బ్లీచింగ్ పౌడర్‌లో పెద్ద ఎత్తున కల్తీ జరిగిందని చెబుతున్నారు. ఇక ఈ ఆరోపణలన్నీ వైసీపీ ఎమ్మెల్యేకు నెగిటివ్ అవ్వడంతో, యరపతినేనికి ప్లస్ అవుతుంది. అలాగే యరపతినేని కూడా టీడీపీలో యాక్టివ్‌గా ఉంటున్నారు. నిత్యం ప్రజలతో టచ్‌లో ఉంటూ, వారి సమస్యలపై పోరాటం చేస్తున్నారు. కార్యకర్తలని కలుపుకునిపోతూ పార్టీని బలోపేతం చేస్తున్నారు.
పైగా గతంలో తాను చేసిన అభివృద్ధి కళ్ళకు కట్టినట్లు కనిపిస్తోంది. అప్పుడు చేసిన అభివృద్ధే తప్పా, వైసీపీ వచ్చాక గురజాలలో కొత్తగా ఏమి జరగలేదు. దీంతో వైసీపీ పట్ల జనం కాస్త అసంతృప్తిగానే ఉన్నట్లు కనబడుతోంది. ఇక ఇటీవల నియోజకవర్గంలో హత్యా రాజకీయాలు ఎక్కువయ్యాయన్న విషయాన్ని కూడా టీడీపీ బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లింది. ఇవన్నీ కాసు మహేష్‌రెడ్డికి మైనస్ అవుతున్నాయి. ఇక నాన్‌లోకల్ కావడంతో ఆయనకు నియోజకవర్గంపై పట్టు దొరక్కపోవడం ఒక మైనస్ అయితే.. రేపు అయినా.. ఆ తర్వాత అయినా ఆయన గురజాలను వదిలేస్తాన్న ప్రచారం బాగా ఎక్కువైంది. మొత్తానికైతే ఎన్నికలయ్యాక ఈ యేడాదిన్నర కాలంలో గురజాల రాజకీయాల్లో ఎమ్మెల్యే మీద టీడీపీ నేత యరపతినేని పైచేయి సాధించారనే చెప్పొచ్చు.
-Vuyyuru Subhash