తిరుపతి ఉప ఎన్నికలని సీరియస్ గా తీసుకున్న బీజేపీ తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో విజయం కోసం రెండంచెల కమిటీలు ప్రకటించింది. ముందుగా తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక ప్రచార కమిటీ ఒక దానిని నియమించింది. ఈ ప్రచార కమిటీ చైర్మన్ గా ఆది నారాయణరెడ్డి వ్యవహరించనున్నారు. ప్రచార కమిటీ సభ్యులుగా సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, జీవీఎల్, కన్నా లక్ష్మీ నారాయణ, శాంతా రెడ్డి, బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఐవీఆర్ కృష్ణారావు, రావెల కిషోర్ బాబు, వాకాటి నారాయణరెడ్డి, సుధీష్ రాంభొట్ల, దాసరి శ్రీనివాసులు, చంద్రమౌళి ఉననున్నారు.
ఇక ప్రత్యేక ఆహ్వానితులుగా పురంధరేశ్వరి, సత్య కుమార్ లు ఉండనున్నారు. అలానే ఎక్స్ అఫిషియో ఆహ్వానితులుగా మురళీధరన్, సునీల్ దియోధర్, సోము వీర్రాజు, నూకల మధుకర్, విష్ణువర్ధన్ రెడ్డి, మాధవ్, సూర్యనారాయణ రాజు, లోకుల గాంధీ ఉండనున్నారు. అలా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంచార్జి : ఆది నారాయణ రెడ్డి ఉండనున్నారు. అలాగే ఒక్కో అసెంబ్లీ కి ఒక్కో ఇంచార్జి ని కేటాయించారు. గూడూరు – పసుపులేటి సుధాకర్, సూళ్లూరుపేట- వాకాటి నారాయణ రెడ్డి, సర్వే పల్లి – బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, వెంకటగిరి – సూర్యనారాయణ, తిరుపతి – పార్థసారథి, శ్రీకాళహస్తి- సైకం జయచంద్రారెడ్డి, సత్యవేడు – చిన్నం రామకోటయ్యలను నియమించారు.