సింపుల్‌గా బరువు తగ్గాలా.. అయితే ఉల్లితో ఇలా చేసేయండి..!

-

బరువు పెరగడం అనేది మన చేతుల్లో లేని పని.. చూస్తూ చూస్తూనే చేతులు దాటిపోతుంది.. మరి పెరిగిన బరువును తగ్గించుకోవడం మాత్రం మన చేతుల్లో పనే అయినా. కాస్త కష్టపడాల్సిందే. జబ్బులు ఊరికే వస్తాయి కానీ..డబ్బులు ఊరికే రావు కదా..! ఇక బరువు తగ్గాలంటే..తిండి విషయంలో నియంత్రణ ఉండాలి, కషాయాలు తాగాలి, వ్యాయామాలు చేయాలి వామ్మో పెద్ద లొల్లి ఉంటుంది. ఇవన్నీ కాదు.. కష్టపడకుండా ఏదైనా మార్గం ఉందా అంటే..అలాంటివి ఉన్నా..రిజల్ట్‌ ఉండదు అంటుంటారు..కానీ సింపుల్‌గా కొవ్వుకరిగించుకునే మార్గం ఒకటుంది. అదే ఉల్లిపాయ.. ఏంటి ఉల్లిపాయా..అసలు ఇది తింటే..గ్యాస్‌ సమస్య, నోరు కంపు..దీంతో బరువు ఎలా తగ్గడం అనేగా మీ డౌట్..!ఉల్లిపాయను వివిధ రకాలుగా ఆహారంలో చేర్చుకోవడం ద్వారా బరువు తగ్గుతారు అంటున్నారు నిపుణులు.
ఉల్లిపాయ రసం కూడా బరువు తగ్గడానికి సహాయం చేస్తుంది. తరిగిన ఉల్లిపాయను నీటిలో వేసి మరిగించాలి. అలా మరిగించిన ఉల్లిపాయను దంచాలి. ఉప్పు, నిమ్మరసంతో కలిపి తాగాలి. దీంతో బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు.
నడుము పరిమాణాన్ని నిర్దిష్ట ఆకృతిలోకి తీసుకురావడానికి ఉల్లిపాయ బాగా పనిచేస్తుందంట. దీనికోసం సలాడ్స్​లో పచ్చి ఉల్లిపాయను చేర్చుకోవచ్చు.. పచ్చి ఉల్లిపాయతో పాటు నిమ్మకాయ రసం కలిపి సలాడ్స్​తో తీసుకుంటే రిజల్ట్‌ బాగుంటుంది.
బరువు తగ్గడానికి ఉల్లిపాయ సూప్ కూడా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. బాణలిలో ఆలివ్ నూనెను వేసి అల్లం, వెల్లుల్లి ముక్కలు వేసి కలపండి. కూరగాయలను ఉల్లిపాయలతో కలిపి సూప్ చేసుకోండి. ఇలా ఉల్లిపాయను రకరకాలుగా ఆహారంలో తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారని అంటున్నారు నిపుణులు.
అయితే ఉల్లిపాయను ఇలా తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారని నిపుణులు అంటున్నారు కానీ.. ఇది అందరికీ ఒకే విధంగా పనిచేస్తుందా అని గ్యారెంటీ లేదు. అందరూ ఉల్లిపాయను తింటే గ్యాస్‌ సమస్య అంటారు కానీ, సమస్య ఉల్లిపాయను తింటం వల్ల కాదు.. ఉల్లిపాయతో పులుసు కూరలు చేసుకుని తినడం వల్ల.. చింతపండు పులుసు వేసి ఉల్లిపాయలు వేసి పులుసు కూరలు చేసుకుని తింటాం.. చింతపండులో ఉండే పులుపు వల్ల సమస్య వస్తుంది.. కానీ మనకు ఉల్లిపాయలే కదా ఎక్కువ కనిపిస్తాయి.. నింద దానిమీద నెట్టేస్తాం.. పైన చెప్పిన వాటిని మీరు ట్రే చేసే ఇంట్రస్ట్‌ ఉంటే ప్రయత్నించండి. కానీ ఏదైనా ఇతర సమస్యలు వస్తే మాత్రం వెంటనే మానేయడం మంచిది. మీ బాడీకీ ఇలాంటివి సెట్‌ కానప్పుడు మనం ఆ ప్రయత్నాలు చేయకపోవడమే ఉత్తమం.!
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news