మంగళవారం తెలంగాణ సీఎం కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి పలు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్ళేది లేదని, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. అలాగే బిజెపి నేతలు తన కూతురు కవితను బిజెపిలో చేరమని అడిగినట్లుగా వెల్లడించారు. ఇంతకన్నా దౌర్భాగ్యపు రాజకీయం మరొకటి ఉంటుందా అని మండిపడ్డారు సీఎం కేసీఆర్. అయితే సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఫైర్ అయ్యారు.
ఎమ్మెల్సీ కవితతో బిజెపి సంప్రదింపులు జరిపిందన్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు. లిక్కర్ స్కామ్ లో చిక్కుకున్న కవితతో సంప్రదింపులు జరపాల్సిన కర్మ బిజెపి పార్టీకి పట్టలేదని అన్నారు ఎంపీ అరవింద్. అయితే టిఆర్ఎస్ పేరును బిఆర్ఎస్ గా మార్చే సమయంలో కవితను పిలవనందువల్లే.. కెసిఆర్ ని బెదిరించడానికి కవిత కాంగ్రెస్ తో సంప్రదింపులు జరిపినట్లు ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికల జరిగితే టిఆర్ఎస్ పార్టీకి 20 సీట్లకు మించి రావు అన్నారు.