పనిమనిషితో యూరిన్‌ నాకించిన బీజేపీ లీడర్‌…పదేళ్ళుగా ప్రత్యక్ష నరకం.. 

-

పనిమనిషి కూడా ఒక మనిషే అని చాలామంది యజమానులు అనుకోరు.. వాళ్లపై చిన్నచూపు ఉంటుంది. వెట్టిచాకిరి చేయించుకుంటూనే తీసిపడేసినట్లు మాట్లాడతారు. అక్కడితో ఆగిపోలేదు ఆ నాయకురాలు.. తన దగ్గర పనిచేస్తున్న గిరిజన పనిమనిషిని చిత్రహింసలు పెట్టింది. ఐర‌న్ పాన్‌తో నోటిపై కొడితే ప‌ళ్లు రాలాయి. టాయ‌లెట్‌ను నాలిక‌తో క్లీన్ చేయించింది. ఫ్లోర్‌పై ప‌డిన యూరిన్‌ను నాకించింది. ఇంత అరచాకం చేసింది ఓ బీజేపీ నాయకురాలు.. ఆఖరికి ఆ నాయకురాలి కొడుకు సాయంతోనే ఆ పనిమినిషికి విముక్తి లభించింది.. అసలేం జరిగిందంటే..
సీమా పాత్ర. జార్ఖండ్‌లో బీజేపీ లీడ‌ర్‌. పార్టీ మ‌హిళా విభాగం జాతీయ వ‌ర్కింగ్ క‌మిటీ స‌భ్యురాలు. భ‌ర్త మ‌హేశ్వ‌ర్ పాత్రా మాజీ ఐఏఎస్ అధికారి. వారి ఇంట్లో గిరిజ‌న మ‌హిళ సునీత‌(29) ప‌దేళ్లుగా ప‌ని చేస్తోంది. ఆ పనిమ‌నిషిపై సీమా పాత్రా చేయ‌ని ఘోరం అంటూ లేదు. చిన్న చిన్న కార‌ణాలకే ఆమెను దారుణంగా హింసించేది. ఐర‌న్ పాన్‌తో నోటిపై కొడితే ప‌ళ్లు రాలాయి. టాయ‌లెట్‌ను నాలిక‌తో క్లీన్ చేయించిందట. ఫ్లోర్‌పై ప‌డిన యూరిన్‌ను నాకించింది. ఆ ప‌నిమ‌నిషి ఒళ్లంతా గాయాలే. కార‌ణం లేకుండానే వేడివేడి గ‌రిట‌తో వాత పెట్టేది. రోజుల త‌ర‌బ‌డి అన్నం పెట్టేది కాదు. క‌నీసం తాగ‌డానికి మంచినీరు కూడా ఇచ్చేది కాదట.. గ‌త ప‌దేళ్లుగా ఈ చిత్ర‌హింస‌ల‌ను సునీత భ‌రిస్తూ వస్తోంది..
ఆ నాయ‌కురాలి కుమారుడు ఆయుష్మాన్ పాత్రా ఈ దారుణాల్ని చూడ‌లేక‌పోయేవాడు. సాధ్య‌మైనంత‌గా ఆ ప‌నిమ‌నిషికి సాయం అందించేవాడట.. ఎంత వారించినా త‌ల్లి విన‌క‌పోవ‌డంతో.. ఈ దారుణాల‌ను త‌న స్నేహితుడు వివేక్ ఆనంద్ బ‌స్కీకి వివ‌రించాడు. త‌న త‌ల్లి ప‌నిమ‌నిషిని చిత్ర‌హింస‌లు పెడుతున్న కొన్ని వీడియోల‌ను షేర్ చేశాడు.. ప్ర‌భుత్వ ఉన్న‌తోద్యోగి అయిన ఆ స్నేహితుడు వెంట‌నే ఆ వీడియోల‌తో పోలీసుల‌ను ఆశ్ర‌యించాడు. వారు సీమా పాత్రా ఇంటిపై దాడి చేసి ప‌నిమ‌నిషి సునీత‌ను కాపాడి, ఆసుప‌త్రిలో చేర్పించారు.
ఈ స‌మాచారం ముందే అందుకున్న సీమా పాత్ర త‌ప్పించుకుని పోతుండ‌గా, పోలీసులు బుధ‌వారం తెల్ల‌వారు జామున అరెస్ట్ చేశారు. ఈ దుర్మార్గాల్లో సీమా పాత్రా భ‌ర్త పాత్ర లేద‌ని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘ‌ట‌న‌, సంబంధిత వీడియోలు సోషల్‌ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. రాజ‌కీయంగా పెను దుమారం లేచింది. స్వ‌యంగా గ‌వ‌ర్న‌ర్ ర‌మేశ్ బియాస్ రాష్ట్ర డీజీపీని పిలిపించుకుని దీనిపై ఆరా తీశారు.
అయితే, బీజేపీ లీడ‌ర్‌ను కాబ‌ట్టి, త‌న‌పై ఈ కుట్ర ప‌న్నార‌ని, తాను అమాయ‌కురాలిన‌ని సీమా పాత్ర  చెప్పుకొచ్చారు.. ఈ దారుణాలు వెలుగులోకి రావ‌డంతో సీమా పాత్రాను పార్టీ నుంచి స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు బీజేపీ ప్ర‌క‌టించింది. ఎస్సీ, ఎస్టీ చ‌ట్టం స‌హా ప‌లు సంబంధిత చ‌ట్టాల్లోని సెక్ష‌న్ల కింద ఆమెపై కేసు నమోదు చేశారు. కోర్టు ఆమెను 14 రోజుల జ్యూడీషియ‌ల్ క‌స్ట‌డీకి పంపించింది.

Read more RELATED
Recommended to you

Latest news