హైదరాబాదులో మరో కొత్త రకం మోసం వెలుగు చూసింది. గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు కొత్త తరహాలో ప్రయత్నాలు చేస్తుంది ఓ ముఠా. గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు వేలిముద్రలు తప్పనిసరి. అయితే ఒకసారి రిజెక్ట్ అయిన యువకులు మళ్లీ వెళ్లేందుకు దొడ్డి దారిలో ప్రయత్నాలు చేస్తున్నారు. వేలిముద్రలకు ఆపరేషన్ చేయించుకొని రిజెక్ట్ అయిన తర్వాత కూడా వెళ్తున్నారు యువకులు. సంవత్సరం పాటు వేలి ముద్రలు కనపడకుండా ఉండే విధంగా ఓ కొత్తరకం సర్జరీ వెలుగులోకి వచ్చింది.
ఈ సర్జరీ చేయించుకున్న తర్వాత దొడ్డిదారిన గల్ఫ్ దేశాలకు వెళుతున్నారు యువకులు. యువకులకు వేలిముద్రల సర్జరీ చేస్తున్న డాక్టర్ తో పాటు కొంతమంది సిబ్బందిని అరెస్టు చేశారు పోలీసులు. ఈ నకిలీ వేలిముద్రల ద్వారా దేశం దాటిపోయిన వారి సంఖ్య చాలానే ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. వారిలో ఎవరు ఏ స్థాయి నేరాలకు పాల్పడ్డారో, ఎవరికి ఎవరితో సంబంధాలు ఉన్నాయో స్పష్టత లేదు.