తలకిందులవుతున్న ఎగ్జిట్ పోల్స్.. లీడింగ్ లో బీజేపీ !

-

నిన్న ఎగ్జిట్ పోల్స్ అన్నీ టీఆర్ఎస్ కే ఆధిక్యం ఉంటుందని పేర్కొన్నాయి. అయితే ఆ అంచనాలను తలకిందులు చేస్తూ పోస్టల్ వోట్స్ లో బీజేపీ దూసుకు వెళుతోంది. గ్రేటర్‌ లో ఎన్నికల అధికారులు తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. ఆ తర్వాత బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. అయితే పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో బీజేపీ ముందంజలో ఉంది. ఆ తర్వాత స్థానలో టీఆర్ఎస్ కనిపిస్తోంది. గ్రేటర్‌లో ఎన్నికల అధికారులు తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు.

ఆ తర్వాత బ్యాలెట్ ఓట్లను కౌంట్ చేస్తారు. అయితే పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో బీజేపీ ముందంజలో ఉంది. ఆ తర్వాత టీఆర్ఎస్ కనిపిస్తోంది. ప్రస్తుత ట్రెండ్ ప్రకారం బీజేపీ 50 చోట్ల లీడ్‌లో ఉండగా.. టీఆర్ఎస్ 30 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక ఎంఐఎం 12 స్థానాల్లో ఎంఐఎం, ఒక స్థానంలో కాంగ్రెస్ లీడింగ్ లో ఉంది. ఇక కొన్నిచోట్ల ఇప్పటి వరకు కూడా ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఓల్డ్ మలక్ పేట, గోషా మహల్‌, రాంనగర్‌లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలు కాలేదు.  

 

Read more RELATED
Recommended to you

Latest news