తాత్కాలిక హెచ్ -1 బి వీసాలతో విదేశీయులకు వేలాది ఉద్యోగులను కేటాయిస్తూ ఫేస్‌బుక్ ఇంక్ అమెరికా ఉద్యోగులపై వివక్ష చూపుతోందని డోనాల్డ్ ట్రంప్ సర్కార్ తీవ్ర ఆరోపణలు చేసింది. 2,600 స్థానాలకు అర్హతగల మరియు అందుబాటులో ఉన్న యుఎస్ కార్మికులను నియమించడానికి, పరిగణించటానికి ఫేస్బుక్ నిరాకరించింది. సగటున 156,000 డాలర్ల వేతనంతో గ్రీన్ కార్డులతో ఇతర దేశాల వారికి శాశ్వతంగా ఉద్యోగాలు చేసే అధికారం కల్పించారు.
న్యాయ శాఖ పౌర హక్కుల విభాగం గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ విషయాలను వెల్లడించింది. అమెరికన్లతో అమెరికన్ కంపెనీలలో ఉద్యోగాలను ఇవ్వలేదు అని ఆరోపణలు వచ్చాయి. ఫేస్‌బుక్, ట్విట్టర్ మరియు గూగుల్ అమెరికన్లను పట్టించుకోవడం లేదని ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు తమకు ఫిర్యాదులు కూడా వచ్చాయి అని ట్రంప్ సర్కార్ పేర్కొంది.