80 స్థానాల్లో బీజేపీ..అరవింద్‌కు బంపర్ ఆఫర్.!

-

తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ దూకుడు కొనసాగుతుంది. ఓ వైపు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు తారస్థాయికి చేరాయి. మరో వైపు బీఆర్ఎస్ లో సైతం ఎక్కడక్కడ వర్గ పోరు నడుస్తోంది. దీంతో రాజకీయంగా బీజేపీకి అడ్వాంటేజ్ గా మారింది. ఈ పరిస్తితులని చక్కగా వాడుకోవాలని బీజేపీ చూస్తుంది. ఇదే క్రమంలో రాష్ట్రంలో రాజకీయ పరిస్తితులపై ప్రధాని మోదీ ఆరా తీశారు. తాజాగా ఎంపీ ధర్మపురి అరవింద్..మోదీతో దాదాపు 20 నిమిషాల పాటు భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఉన్న పరిస్తితులని అరవింద్..మోదీకి వివరించినట్లు చెప్పారు. అలాగే తెలంగాణలో బీజేపీ 80కి పైగా స్థానాలని గెలుస్తుందని మోదీ ఆశిస్తున్నారని చెప్పారు.

అయితే ఇటీవల రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్..72 సీట్లు గెలుస్తామని చెప్పిన విషయం తెలిసిందే. మొత్తానికి బీజేపీ గెలుపుపై మోదీ ధీమాగా ఉన్నారు. ఇదిలా ఉంటే అరవింద్ పర్సనల్‌గా మోదీతో భేటీ కావడంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. అరవింద్‌కు కేంద్ర మంత్రి పదవి ఇవ్వబోతున్నారని ప్రచారం మొదలైంది. ఇప్పటికే తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నారు. అటు లక్ష్మణ్‌కు రాజ్యసభ ఇచ్చారు.

అయితే ఇంకా మిగిలిన ఎంపీలు అరవింద్, సోయం బాపురావు, బండి సంజయ్ ఉన్నారు. లక్ష్మణ్‌కు రాజ్యసభ ఇచ్చారు కాబట్టి ఆయనకు కేంద్ర మంత్రి పదవి కూడా ఇస్తారనేది డౌటే. అటు బండి రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నారు..ఆయన దూకుడుగా పనిచేస్తున్నారు కాబట్టి ఆయనని మళ్ళీ కేంద్ర రాజకీయాల్లో పడేయరు. ఇక సోయం, అరవింద్‌లు ఉన్నారు. వీరిలో దూకుడుగా ఉండే అరవింద్‌కే కేంద్ర మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరుగుతుంది.

ఇప్పటికే ఆయన కేసీఆర్, కవితలపై ఒంటి కాలిపై వెళుతున్నారు. ఇలాంటి తరుణంలో ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇస్తే ఇంకా దూకుడుగా వెళ్తారని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి చూడాలి అరవింద్‌కు బంపర్ ఆఫర్ ఉంటుందో లేదో.

Read more RELATED
Recommended to you

Latest news