మద్యానికి బదులు.. గంజాయిని ప్రోత్సహించాలి : భాజపా ఎమ్మెల్యే

-

తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొందరు భాజపా నాయకులకు పరిపాటిగా మారింది. ఇటీవలే వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఓ వ్యక్తి హత్యకు.. దేశంలో హింసకు కారణమయ్యారు మాజీ భాజపా నేత నుపుర్ శర్మ. ఇప్పుడు తాజాగా ఛత్తీస్​గఢ్ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యే కృష్ణమూర్తి బాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

మద్యానికి బదులుగా గంజాయి, భాంగ్​ను ప్రోత్సహిస్తే అత్యాచారాలు, హత్యలు వంటి నేరాలు జరగకుండా ఉంటాయని కృష్ణమూర్తి అన్నారు. ఈనెల 23న మార్వాహి జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని.. ఈ విషయాన్ని గతంలో అసెంబ్లీలో కూడా చర్చించినట్లు చెప్పారు. మద్యపాన నిషేధంపై ఓ కమిటీ ఏర్పాటు చేయాలని.. గంజాయి, భాంగ్ వినియోగం దిశగా కమిటీ యోచన చేయాలని కోరారు.

భాజపా ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడ్డాయి. ప్రజాప్రతినిధి హోదాలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా అని కాంగ్రెస్​ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది.​ అయితే దీనిపై స్పందించిన భాజపా ఎమ్మెల్యే.. ఎన్నికల్లో కాంగ్రెస్​ ఇచ్చిన మద్యపాన నిషేధం హామీ ఏమైందని తిరిగి ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news