అసెంబ్లీలోనే గవర్నర్ ను అవమానించి.. బల్లలు ఎక్కిన హరీశ్ రావు చెప్పే నీతులు వినే స్థితిలో లేమని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. దేశ చరిత్రలోనే బడ్జెట్ ప్రసంగంలో రాజకీయ విమర్శలు చేసిన ఘనత హరీష్ రావుకే దక్కుతుందని విమర్శించారు. కేంద్రాన్ని తిట్టడానికే బడ్జెట్ స్పీచ్ ను ఉపయోగించుకున్నారని మండి పడ్డారు. తమ లాగే.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఆందోళన చేశారని.. వారిని ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు.
తమను ఏ సెక్షన్ కింద సస్పెండ్ చేశారో స్పీకర్ సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమను ఏ సెక్షన్ ప్రకారం సస్పెండ్ చేశారో.. అని రాత పూర్వక సమాధానం ఇవ్వాలని అసెంబ్లీ కార్యదర్శి అడిగామని తెలిపారు. అయితే నాలుగు రోజుల సమయం కావాలని వాళ్లు చెప్పినట్టు తెలిపారు. కాగ సస్పెన్షన్ ను సవాల్ చేస్తు హైకోర్టు పిటిషన్ వేసినట్టు తెలిపారు. హై కోర్టు తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే సస్పెన్షన్ పై రాష్ట్రపతి రామ్ నాథ్ కొవింద్ ను కూడా కలుస్తామని తెలిపారు.