అసెంబ్లీలో పొగాకు తింటూ.. వీడియో గేమ్ లు ఆడుతున్న బిజెపి ఎమ్మెల్యేలు

-

దేశంలోని పార్లమెంట్, అసెంబ్లీలు ప్రజా సమస్యల వేదికలు. ప్రజా సమస్యలను ప్రతిపక్షాలు లేవనెత్తడం.. అధికారపక్షం వాటిని తీర్చడం.. ప్రభుత్వాలు కీలక ప్రకటనలు చేయడం.. చట్టాలు రూపొందించడం అన్ని వాటిల్లోనే జరుగుతుంటాయి. అయితే దేశంలోని కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ సమావేశాలు చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. ప్రజా సమస్యలు పరిష్కరించమని ఓట్లు వేసి గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే ఓ ఇద్దరు ఎమ్మెల్యేలు చేసిన పని సభ్య సమాజం తలపంచుకునేలా ఉంది.

సభ జరుగుతుండగా ఉత్తరప్రదేశ్ కి చెందిన ఝాన్సీ నియోజకవర్గ బిజెపి ఎమ్మెల్యే పొగాకు నములుతూ కనిపించాడు. మరో ఎమ్మెల్యే నేమో వీడియో గేమ్ ఆడుతూ కెమెరాకు చిక్కాడు. దీనికి సంబంధించిన వీడియోను సమాజ్వాది పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సదరు ఎమ్మెల్యేలపై తీవ్ర విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version