ఎటిసితో సంబంధాన్ని కోల్పోయిన బీజేపీ ఎంపీ ఛాపర్‌..ఎంపీ సహా అందరూ..

-

భారతీయ జనతా పార్టీ ఎంపీ మనోజ్ తివారీకు గురువారం పెద్ద ప్రమాదం తప్పింది..మనోజ్ తివారీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఎటిసి)తో సంబంధాలు కొల్పోవడంతో పాట్నా విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు..తివారీతో పాటు ఆయన సహాయక సిబ్బంది అందరు ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారు..ఎంపీ తివారీ గురువారం ఉదయం రాజకీయ ర్యాలీ కోసం బెట్టియా వెళ్తుండగా..సాంకేతిక లోపం కారణంగా ఛాపర్ 40 నిమిషాలు ఏటీసీతో సంబంధాలు కోల్పోయింది..పాట్నా విమానాశ్రయం నుండి ఉదయం 10.10 గంటలకు హెలికాప్టర్ బయలుదేరింది.. అది బయలుదేరిన కొద్దిసేపటికే ఎటిసితో సంబంధాలను కోల్పోయింది..హెలికాప్టర్ ఏటీసీతో సిగ్నల్ కోల్పోవడంతో మేము చాలా భయాందోళనలకు గురియ్యామని హెలికాప్టర్లో మనోజ్ తివారీతో కలిసి వచ్చిన నీల్ బక్షి చెప్పారు.
మేము ఎక్కడున్నామో తెలియకపోవడంతో 40 నిమిషాలు భయంకరమైన అనుభవం ఎదురైందని..అప్పుడు పైలట్ పాట్నా విమానాశ్రయాంలోని ఏటీసీ అధికారులతో సంబంధాలను తిరిగి రావడానికి చాలా ప్రయాత్రాలు చేశాడని..చివరికి ATCని సంప్రదించడానికి వేరే మార్గం లేనందున ATC కి సిగ్నల్ పంపే ప్రయత్నంలో అత్యవసర లైట్లను పైలట్ స్విచ్ ఆన్‌ చేయవల్సి వచ్చిందని బక్షి తెలిపారు..అత్యవసర ల్యాండింగ్ సమయంలో ఆ హెలికాప్టర్ సురక్షితంగా భూమిపైకి వచ్చే వరకు పాట్నా విమానాశ్రయంలోని అన్ని రకాల విమాన కార్యకలాపాలను నిలిపివేశారు. విమానాశ్రయ అధికారాలు ఫైర్ ఇంజిన్, మెడికల్ స్టాఫ్ మరియు అంబులెన్స్ వంటి అత్యవసర సేవలను స్టాండ్బైలో ఉంచారు..గతంలో కూడా కేంద్ర న్యాయ మంత్రి రవిశంకర్ ప్రసాద్, బీహార్ ఆరోగ్య మంత్రి మంగల్ పాండే ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో అనేక ప్రమాదాలకు గురుయయ్యాని గుర్తు చేసుకున్నారు నీల్ బక్షి.

Read more RELATED
Recommended to you

Latest news