స్పీకర్ పై సీఎం ఒత్తడి కనిపించింది: రాజాసింగ్

-

హైకోర్ట్ ఆర్డర్ వచ్చిన తర్వాత స్పీకర్ ని కలిసిన తర్వాత ఆయనలో భయం కనిపించిందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఆయన చెప్పిన మాటల్లో భయం కనిపించిందని అన్నారు. స్పీకర్ గారిపై సీఎం ఎంత టార్చర్, ఎంత ఒత్తడి పెడుతున్నారో మాకు అర్థం అయిందని రాజాసింగ్ అన్నారు. నేను పోడియం వద్దకు వచ్చానని.. మా ఇద్దరు ఎమ్మెల్యే ఏం తప్పు చేశారని.. వారిని ఎందుకు సస్పెండ్ చేశారని స్పీకర్ ని కోరారని రాజాసింగ్ అన్నారు. సభలో బీజేపీ వాయిస్ లేకుండా చేశారని విమర్శించారు. తెలంగాణలో చాలా సమస్యలు ఉన్నాయని.. మాట్లాడటానికి అవకాశం ఇవ్వాలని కోరినా స్పీకర్ వినలేదని రాజాసింగ్ అన్నారు. కోర్ట్ ఆర్డర్ వచ్చిందని వచ్చారే తప్పితే  ముందుగా ప్లాన్ ప్రకారమే మమ్మల్ని సభలోకి రానివ్వలేదని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో స్పీకర్ పక్కనే 10 మంది సభ్యుల వెళ్లి నిరసన తెలపినా.. సస్పెండ్ చేయలేదని.. మన అసెంబ్లీలో మాత్రం మా మాట వినాలంటే సస్పెండ్ చేశారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి చేస్తున్న దౌర్జన్యాన్ని యావత్ తెలంగాణ గమనిస్తోందని రాజా సింగ్ అన్నారు. తెలంగాణ ప్రజల రక్తం తాగుతున్నారని సీఎంపై విమర్శలు గుప్పించారు. ఇందిరా పార్క్ లో 17న నిరసన దీక్ష పెట్టుకున్నామని రాజసింగ్ అన్నారు. బీజేపీ నాయకులు పాల్గొంటారని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news