కాషాయ వ్యూహాలు..కవితతో కేసీఆర్‌కు చిక్కులు!

-

కమలదళం వ్యూహాలకు కేసీఆర్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని చెప్పొచ్చు…ఇంతకాలం డేరింగ్ అండ్ డ్యాషింగ్ పాలిటిక్స్ చేస్తూ..ప్రత్యర్ధులకు చుక్కలు చూపించిన కేసీఆర్‌కు ఇప్పుడు బీజేపీ చెమటలు పట్టిస్తుంది. నెక్స్ట్ కేసీఆర్‌ని గద్దె దించడమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీ బలపడింది…ఉపఎన్నికల్లో అదిరిపోయే విజయాలని సొంతం చేసుకుని..మునుగోడు ఉపఎన్నికలో కూడా సత్తా చాటాలని చూస్తుంది.

అయితే ఈ సారి కమలం పార్టీకి ఛాన్స్ ఇవ్వకూడదని కేసీఆర్ కష్టపడుతున్నారు..కానీ గతానికి భిన్నంగా కేసీఆర్ రాజకీయ శైలిలో ఉంది..ఇప్పుడు కేసీఆర్ లో టెన్షన్ ఎక్కువ కనబడుతోంది..బీజేపీపై ఆయన మాటల దాడి చూస్తుంటే..బీజేపీ వల్ల డేంజర్ ఉందని కేసీఆర్ అర్ధమైనట్లు కనిపిస్తోంది. బీజేపీ వల్ల భయం మాత్రం వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ భయాన్ని ఇంకా రెట్టింపు చేసే దిశగా బీజేపీ పనిచేస్తుంది. కేసీఆర్ ఎలాంటి మాటల దాడి చేసిన…దానికి ఎదురుదాడి చేయాలని బీజేపీ చూస్తుంది.

మొన్న మునుగోడు సభలో కేసీఆర్ పూర్తిగా మోదీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి విమర్శలు చేసిన విషయం తెలిసిందే…మోదీ వల్ల దేశం నాశనమైపోతుందనే విధంగా మాట్లాడారు..దానికి కౌంటర్ గా కేసీఆర్ వల్ల తెలగాణ నష్టపోయిందని బీజేపీ నేతలు ఎప్పటినుంచో ఫైర్ అవుతున్నారు. కుటుంబ పాలన నడుస్తోందని, ఈ పాలనకు విముక్తి కల్పిస్తామని అంటున్నారు.

అదే సమయంలో కేసీఆర్ అవినీతిపై విచారణ చేయిస్తామని బీజేపీ నేతలు అంటున్నారు…ఈ క్రమంలోనే తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కేసీఆర్ తనయురాలు, ఎమ్మెల్సీ కవిత పేరు రావడం చర్చనీయాంశమైంది. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో కేసీఆర్‌ కూతురు కవిత ఉన్నారని, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌, డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియాలకు ఆమె ఇతరుల ద్వారా రూ.4.5 కోట్లు ఇప్పించారంటూ బీజేపీ ఎంపీ పర్వేశ్‌ వర్మ ఆరోపణలు చేశారు.

దీనిపై కవిత వివరణ ఇచ్చారు…ఆ స్కామ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని, కేసీఆర్‌ని దెబ్బకొట్టడానికి తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని, ఈ విషయంపై బీజేపీ నేతలపై పరువు నష్టం దావా వేస్తానని కవిత అన్నారు. అయితే ఈ వ్యవహారంపై కేసీఆర్…కవితపై మండిపడినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఏదేమైనా గాని లిక్కర్ స్కామ్ లో కవిత పేరు రావడం…కేసీఆర్‌కు పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news