కాంగ్రెస్ పార్టీ గతంలో నడిపిన పత్రిక నేషనల్ హెరాల్డ్ ఆస్తుల వ్యవహారానికి సంబంధించిన కేసులో తమ ముందు విచారణకు హాజరు కావాలంటూ సోనియా గాంధీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడి) సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈడీ సమన్ల మేరకు సోనియా గాంధీ విచారణకు హాజరు అవుతున్నారు. సోనియాగాంధీని ఈడి విచారించడాన్ని తప్పుపట్టారు బట్టి విక్రమార్క.ఈ సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించిన బట్టి విక్రమార్క మాట్లాడుతూ..కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కి ఈడి విచారణకు పిలవడాన్ని, తప్పుడు కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్రతో బిజెపి ఆందోళన చెందుతుందన్నారు. ఈ నేపథ్యంలోనే సోనియాగాంధీ, రాహుల్ పై కేసులు నమోదు చేసిందన్నారు.భారత జాతిని విచ్చిన్నం చేసేందుకు బిజెపి ప్రయత్నిస్తుందనీ మండిపడ్డారు.కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బిజెపి అరాచకాలు బయటికి వస్తాయనే ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీ నీ అడ్డుకునేందుకు బిజెపి ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు బట్టి.