విశ్వబ్రాహ్మణులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. విశ్వబ్రాహ్మణ ఆత్మగౌరవ భవనం కోసం ఐదు ఎకరాల భూమి, 5 కోట్లు కేటాయించారు సీఎం కేసీఆర్. ఈ మేరకు తాజాగా అధికారిక ఉత్తర్వులు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే… ఉప్పల్ భగయత్లో విశ్వబ్రాహ్మణుల ఆత్మగౌరవ భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన ఐదెకరాల స్థలాన్ని తెలంగాణ బీసీ కమిషన్ సభ్యుడు సీహెచ్ ఉపేంద్ర సందర్శించారు. విశ్వబ్రాహ్మణుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించినందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
2014 కు ముందు ఏ ప్రభుత్వం కూడా మన విశ్వబ్రాహ్మణులకు ఒక్క ఎకరం భూమి కూడా కేటాయించలేదు. మన అభివృద్ధికి కొరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రధ్ధా వహించి రాష్ట్రంలోని 20 లక్షల మంది మన విశ్వబ్రాహ్మణులకు 5 ఎకరాల భూమి, 5 కోట్లు కేటాయించడం అంటే విశ్వబ్రాహ్మణుల అభివృద్ధిపై కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించడం అని ఉపేంద్ర అన్నారు. ‘‘విశ్వబ్రాహ్మణుల ఆత్మగౌరవ భవనాన్ని” నిర్మించడం అంటే తెలంగాణలోని 20 లక్షల మంది విశ్వబ్రాహ్మణ పౌరులకు, వారి పిల్లల అభివృద్ధి కొరకు భరోసా లభించినంటే అని అన్నారు. భవిష్యత్తులో మన విద్యార్థుల విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు, వృత్తుల ఆధునీకరణ కోసం ఈ విశ్వబ్రాహ్మణ ఆత్మగౌరవ భవనం దిక్సూచిగా నిలవనుందని ఆయన అన్నారు.