నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా ఎవరు నిలబడిన సరే కొన్ని కొన్ని పరిస్థితులు మాత్రం బీజేపీకి ఇబ్బందికరంగానే ఉండవచ్చు అనే అభిప్రాయం ఎక్కువగా వ్యక్తమవుతుంది. రాజకీయంగా ఇతర ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులు వేరు నాగార్జునసాగర్ పరిధిలో ఉన్న పరిస్థితులు వేరు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. నాగార్జునసాగర్లో కొన్ని కొన్ని అంశాలు కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా అనుకూలంగా ఉన్నాయి.
అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీకి కూడా పరిస్థితులు ఉన్నా సరే జానారెడ్డిని తట్టుకుని భారతీయ జనతా పార్టీ గెలవడం అనేది సాధ్యం కాదు అనే భావన ఉంది. ఏ సామాజిక వర్గానికి ఇక్కడ సీటు ఖరారు చేసినా సరే భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం సాధ్యం కాదు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజకీయంగా ఇక్కడ కొన్ని అంశాలు చాలా వరకు సీరియస్ గానే ఉంటాయి. ఆంధ్రప్రాంతం ఓటర్లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వాళ్ల ప్రభావం అక్కడ కనపడుతూ ఉంటుంది.
కాబట్టి జానారెడ్డి ఎక్కడ సీరియస్ గా కష్టపడుతున్నారు. ముందు నుంచి కూడా ఆయనకు ఇక్కడ వ్యక్తిగత ఇమేజ్ ఎక్కువగానే ఉంది. ఆంధ్ర ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ కూడా ఈ నియోజకవర్గం మీద ఫోకస్ గట్టిగానే పెట్టారు. బీజేపీకి ఆంధ్ర ఓటర్లు వ్యతిరేకంగా ఉన్న నేపథ్యంలో ఆ పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉండకపోవచ్చు. మెదక్ జిల్లాలో బీజేపీకి అనుకూలంగా పరిస్థితులు ఉన్నాయి కాబట్టే ఉప ఎన్నికల్లో ఆ పార్టీ విజయం సాధించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా దాదాపుగా అంతే.