ప్రేమ – ప్రతీకారం నేపథ్యంలో ‘బ్లాక్‌ అండ్‌ వైట్‌’ ట్రైలర్‌

-

హెబ్బా పటేల్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతూనే, సక్సెస్ ను చూసింది. ఆ క్రేజ్ తో వరుస సినిమాలు చేస్తూ వెళ్లింది. అయితే ఒకానొక దశలో ఆమె వరుస ఫ్లాపులను ఎదుర్కొంది. ఆ తరువాత కథానాయికగా వెనుకబడిన ఆమె, ఐటమ్ సాంగ్స్ లోను మెరిసింది. ఈ మధ్య కాలంలో తెరపై ఆమె కనిపించలేదు.

మళ్లీ ఇప్పుడు ‘బ్లాక్ అండ్ వైట్’ సినిమాతో ఆడియన్స్ ను పలకరించడానికి రెడీ అవుతోంది. కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. హెబ్బా పటేల్ ప్రేమలో పడటం .. మోసపోవడం .. అందుకు ప్రతీకారం తీర్చుకోవడం ఈ ట్రైలర్ లో కనిపిస్తోంది. ఎన్‌ఎల్‌వీ సూర్య ప్రకాశ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ టీజర్‌ను ఇప్పటికే రిలీజ్‌ చేయగా.. మంచి స్పందన వస్తోంది. తాజాగా మేకర్స్ బ్లాక్ అండ్‌ వైట్ ట్రైలర్‌ను లాంఛ్‌ చేశారు. ఈ చిత్రానికి అజయ్‌ అరసద మ్యూజిక్ అందిస్తున్నాడు. ఏ మేఘనా రెడ్డి సమర్పణలో వస్తున్న ఈ మూవీలో సూర్య శ్రీనివాస్ లహరి శారీ, నవీన్‌ నేని కీలక పాత్రలు పోషిస్తున్నారు.

రంగుల్లేని నా జీవితానికి ఒక అందమైన పెయింటింగ్‌లా కలిశావ్‌ కదా అని గుండెల్లో నీ బొమ్మ గీసుకున్నాను.. అని కారు డ్రైవ్‌ చేస్తున్న హెబ్బాపటేల్‌ వాయిస్ ఓవర్‌తో మొదలైంది ట్రైలర్‌. ప్రేమలో పడ్డ హెబ్బా పటేల్‌ ఎన్నో ఆశలతో జీవితాన్ని అందంగా ఊహించుకున్న క్రమంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకోవడం, హెబ్బాపటేల్‌ ప్రియుడు హత్యకు గురికావడం, ఆ తర్వాత ఏం జరిగిందనే విషయాన్ని సస్పెన్స్ లో పెడుతూ కట్ చేసిన ట్రైలర్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
హెబ్బా పటేల్‌ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. శాసనసభ చిత్రంలో స్పెషల్ సాంగ్‌లో మెరవనుంది. దీంతోపాటు తెలిసినవాళ్లు, గీత, వల్లన్‌, ఆద్య చిత్రాల్లో నటిస్తోంది హెబ్బా పటేల్‌.

 

 

Read more RELATED
Recommended to you

Latest news