ముంబై ఇండియన్స్ మహిళల ప్రీమియర్ లీగ్ లో చాల చిన్న స్కోర్ నమోదుచేసింది. యూపీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టార్ ప్లేయర్లు నిలకడగా ఆడలేకపోవడంతో ముంబై 127 పరులకే ఆల్ ఔట్ అయింది. యూపీ బౌలర్లు విజృంభించడంతో ఆ జట్టు అన్ని వికెట్లు కోల్పోయింది. ముంబై మిడిలార్డర్ ఈ మ్యాచ్‌లో భారీగా విఫలం అయింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా ఎక్కువ స్కోర్ చేయలేకపోయింది. అయితే.. చివర్లో ఇసీ వాంగ్(32) బ్యాట్ ఝులిపించడంతో ముంబై కనీసం ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది. ఆఖరి ఓవర్‌లో సిక్స్, ఫోర్ కొట్టింది ఇసి వాంగ్. ఆఖరి ఓవర్‌లో దీప్తి వాంగ్, ఇషాక్‌ను రనౌట్ చేయడంతో ముంబై ఇన్నింగ్స్ ముగిసింది. యూపీ వారియర్స్ బౌలర్లలో సోఫీ ఎక్లెస్టోన్ మూడు రాజేశ్వరీ గైక్వాడ్, దీప్తి శర్మ రెండేసి వికెట్లు తీశారు. అంజలీ సర్వాణీకి ఒక వికెట్ దొరికింది.
టాస్ ఓడిపోయిన ముంబై ఇండియన్స్ 30 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయింది. యస్తికా భాటియా (7)ను అంజలీ సర్వానీ బౌల్డ్ చేసింది. ఆ తర్వాత వచ్చిన నాట్ సీవర్ బ్రంట్ (5)ను ఎక్లోస్టోన్ ఎల్బీగా వెనక్కి పంపింది. ధాటిగా ఆడుతున్న ఓపెనర్ హేలీ మాథ్యూస్ (35) కీపర్ హేలీ క్యాచ్ పట్టడంతో వెనుదిరిగింది. దాంతో, 57 రన్స్‌కే కీలకమైన నాలుగు వికెట్లు పడ్డాయి. ఈ నేపధ్యం లో, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (25) ఐదో వికెట్‌గా ఔటయ్యింది. 78 రన్స్ వద్ద ఆమె వికెట్ పడడంతో.. ఒక దశలో ముంబై 100 పరుగల లోపే ఆలౌట్ అయ్యేలా కనిపించింది. కానీ, చివర్లో ఆల్‌రౌండర్ ఇసీ వాంగ్ చెలరేగి ఆడింది. 4 ఫోర్లు, ఒక సిక్స్‌తో 19 బంతుల్లోనే 32 రన్స్ చేసి స్కోర్ నిలిపింది.