పంజాబ్‌లో హై టెన్షన్.. ఇంటర్నెట్‌ బంద్

-

పంజాబ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అన్ని రకాల మొబైల్ ఇంటర్నెట్ సేవలను, ఎస్‌ఎంఎస్ సేవలను నిలిపివేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఖలిస్తానీ లీడర్.. వారిస్ పంజాబ్ డి చీఫ్ అమృత్ పాల్ సింగ్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. మార్చి 18వ తేదీ శనివారం జలంధర్ లోని నకోదర్ సమీపంలోని అదుపులోకి తీసుకున్నారు. అతనితోపాటు మరో ఆరుగురిని కూడా కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. అరెస్ట్ కు ముందు రాష్ట్రంలో హైడ్రామా నడిచింది. అమృత్ పాల్ సింగ్ ను.. 50 వాహనాల్లో వెంబడించి మరీ అదుపులోకి తీసుకున్నారని.. రహస్య ప్రదేశానికి తరలించారనే వార్తలతో.. పంజాబ్ లోని ప్రత్యేక వేర్పాటు వాదులు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. పోలీసులు సైతం భారీగా మోహరించి.. చెదరగొడుతున్నారు.

రాష్ట్రంలో శాంతి భద్రతల దృష్ట్యా ఇంటర్నెట్ బంద్ చేశారు. మార్చి 19వ తేదీ ఆదివారం సాయంత్రం వరకు పలు జిల్లాల్లో మొబైల్
ఇంటర్నెట్ సేవలను కట్ చేసింది ప్రభుత్వం. ఎస్ఎంఎస్ సేవలను సైతం నిలిపివేసింది పంజాబ్ సర్కార్. అమృత్ పాల్ సింగ్ ను అరెస్ట్ చేయటానికి కారణాలు ఉన్నాయని చెబుతున్నారు పోలీసులు. కొన్ని రోజుల క్రితం ఆయుధాలతో బెదిరిస్తూ.. పోలీస్ బారికేడ్లను ఢీకొట్టి.. అజ్నాలా పోలీస్ స్టేషన్ పై దాడి చేసి.. తన అనుచరులను బలవంతంగా తీసుకెళ్లారని.. ఆ దాడిలో చాలా సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయని.. అప్పటి నుంచి పరారీలో ఉన్న అమృత్ పాల్ సింగ్, అతని అనుచరులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు పోలీసులు.

రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినా.. రోడ్లపై ఆందోళనలు చేసినా.. తప్పుడు సమాచారం వ్యాప్తి చేసినా కఠిన చర్యలు ఉంటాయని.. లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీ లేదని ప్రకటించారు పోలీసులు. ఎలాంటి పరిస్థితులనైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని.. ప్రజలు ఎవరూ భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని ప్రకటించారు పంజాబ్ పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news