ఉద్యోగులను బ్లాక్ మెయిల్ చేయడం తగదు – సిపిఐ రామకృష్ణ

-

ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి, మంత్రులు పట్టించుకోకపోతే వారి బాధలు ఇంకెవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. వారి సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు గవర్నర్ కి విన్నవించడం నేరమా? అని ప్రశ్నించారు. ఉద్యోగ సంఘాల నేతలు రాజకీయ అంశాలు ఏవి ప్రస్తావించలేదు కదా.. మరి ఉద్యోగుల సంఘం గుర్తింపును రద్దు చేస్తామని ప్రభుత్వం బ్లాక్ మెయిల్ చేయడం ఏంటని మండిపడ్డారు.

ఉద్యోగులపై కక్ష సాధింపు ధోరణి సరికాదన్నారు రామకృష్ణ. సూర్యనారాయణ పై యాక్షన్ తీసుకుంటానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని.. ఇది సరైన పద్ధతి కాదన్నారు. జీవో నెంబర్ 1 విషయంలో ఇలానే పొరపాటు చేశారని.. పొలిటికల్ పార్టీలు రోడ్డెక్కకూడదనే జీవో తెచ్చారని మండిపడ్డారు. అందరినీ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు రామకృష్ణ.

Read more RELATED
Recommended to you

Latest news