నిజామాబాద్ జిల్లా బోధన్ బంద్ కు బిజెపి పార్టీ పిలుపు ఇచ్చింది. దీంతో ఇవాళ ఉదయం నుంచి బోధన నగరంలో బంద్ కొనసాగుతోంది. బంద్ ను విజయవంతం చేయాలని బిజెపి పార్టీ శ్రేణులను కోరింది అధిష్టానం. బోధన్ నగరంలో శివాజీ విగ్రహం ఏర్పాటు రెండు వర్గాల మధ్య వివాదానికి తావు ఇచ్చింది. అర్ధరాత్రి విగ్రహాన్ని పెట్టడం తో టిఆర్ఎస్ పార్టీ మరియు బిజెపి పార్టీ నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
అక్కడితో ఆగకుండా ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ సంఘటన అంతా నిన్న చోటు చేసుకోగా… ఇవాళ బందుకు పిలుపునిచ్చింది బిజెపి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో బోధన్ నగరంలో.. శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా 144 సెక్షన్ విధించారు. శివాజీ విగ్రహం తో పాటు బోధన్ అన్ని చోట్ల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. అనుమతి లేకుండా విగ్రహాన్ని ఏర్పాటు చేయడం వలన ఈ వివాదం ఏర్పడిందని పోలీసులు వివరించారు. అలాగే ఈ బంద్ కొనసాగకుండా పోలీసులు అన్ని చర్యలు చేపడుతున్నారు.