రాజమౌళి వ్యాఖ్యలు నిజం చేస్తున్న బాలీవుడ్ ప్రముఖులు!

-

గతంలో రాజమౌళి ఒక ఇంటర్వ్యూ సందర్బంగా బాలీవుడ్ పై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో కార్పొరేట్ సంస్థల రావడం తో అధిక రెమ్యునరేషన్ ఇచ్చుకుంటూ సినిమాల్లో కంటెంట్ తగ్గటానికి కారణం అయ్యారని చెప్పారు.అలాగే భారీ హిట్ అందుకోవాలంటే లు భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం లేదని కాంతార లాంటి చిన్న బడ్జెట్ సినిమాలు కూడా బడ్జెట్ కంటే పది రెట్లు వసూలు చేశాయి అని  అన్నారు.

ఇక దీనిపై ప్రముఖ నిర్మాత కరణ్‌ జోహార్‌ సైతం ఓ ఇంటర్వ్యూలో ధృవీకరిస్తూ కొందరు తారలు మరీ ఎక్కువ మొత్తాన్ని అడుగుతారని , దాని వల్ల సినిమా బడ్జెట్ లు పెరిగి ప్లాప్ లు గా మారాయని ఆవేదన వ్యక్తం చేశాడు. తాజాగా మరో అగ్ర నిర్మాత, టీ సిరీస్‌ అధినేత భూషణ్‌ కుమార్‌ సైతం ఇదే విషయంపై రీసెంట్ గా కుండ బద్దలు కొట్టినట్లు గా మాట్లాడారు.

కొందరు హీరోలు చాలా బాగా అర్థం చేసుకుంటారు. కొందరు మాత్రం అడ్డ దిడ్డంగా అడుగుతూ ఉంటారు. వాళ్ళకు సరైన మార్కెట్ కూడా ఉండదు. వారికి అంత ఇవ్వాల్సిన అవసరం లేదని మొహం మీదనే చెప్పేస్తాను.మేమెందుకు తలకు మించిన భారాన్ని మోయాలి? చిన్న హీరోలకే రూ.20-25 కోట్ల దాకా ఇస్తే సినిమా సరిగా ఆడకపోతే అది మాకు భారమే కదా! చిన్న సినిమాకు కూడా రూ.20 కోట్లు డిమాండ్‌ చేస్తారు అని కొందరు హీరోలపై మండి పడ్డారు.

 

Read more RELATED
Recommended to you

Latest news