లవ్‌ ఓకే, మ్యారేజ్ నాట్ ఓకే అంటోన్న హీరోయిన్లు

Join Our Community
follow manalokam on social media

ప్రేమ ముదిరితే పెళ్లి అవుతుంది అంటారు. కానీ కొంతమంది హీరోయిన్లకి ప్రేమతో పాటు, వయసు కూడా ముదురుతోంది గానీ, పెళ్లి మాత్రం కాట్లేదు. లవ్‌యాత్రలతో ఫారెన్ టూర్లు తిరుగుతున్నారు గానీ, పెళ్లి యాత్రకి మాత్రం దూరంగా ఉంటున్నారు. మరి లవ్‌ ఓకే, మేరేజ్ నాట్ ఓకే అంటోన్న ఆ హీరోయిన్ల పై బాలీవుడ్ లో హాట్ హాట్ గా గాసిప్స్ నడుస్తున్నాయి.

శ్రద్ధా కపూర్‌ ప్రేమలో ఉందని చాన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ రోహణ్ శ్రేష్ఠాతో లవ్‌లో ఉందని, త్వరలోనే వీళ్లిద్దరు పెళ్లి చేసుకుంటారనే టాక్ వస్తోంది. రీసెంట్‌గా శ్రద్ధ కజిన్‌ ప్రియాంక్ శర్మ పెళ్లిలోనూ రోహణ్‌ మెరిశాడు. దీంతో వీళ్లు డీప్‌ రిలేషన్‌లో ఉన్నారనే మాటలు మరింత ఎక్కువయ్యాయి. కానీ శ్రద్ధా మాత్రం ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచనలో లేదట. మరికొన్నాళ్లు కెరీర్‌ కంటిన్యూ చెయ్యాలనుకుంటోందట శ్రద్ధ.

ఆలియా భట్‌, రణ్‌బీర్ కపూర్ ఇద్దరూ మూడేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. హాలిడే ట్రిప్పులకి ఫారిన్‌ కూడా వెళ్తున్నారు. ఇంట్లోవాళ్లు కూడా వీళ్ల ప్రేమకి గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారు. కానీ రణ్‌బీర్‌ కపూర్ మాత్రం పెళ్లికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఆలియా తొందరపెడుతున్నా, రణ్‌బీర్ మాత్రం పెళ్లిని వాయిదా వేస్తున్నాడని చెప్తున్నారు.
నయనతార, విఘ్నేష్ శివన్‌ పెళ్లి గురించి కరోనా లాక్‌డౌన్‌కి ముందు నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ కరోనా వ్యాక్సిన్‌ వచ్చినా వీళ్లు మాత్రం ఇంకా సింగిల్‌గానే ఉంటున్నారు. బర్త్‌డే పార్టీలు, హాలిడే ట్రిప్పులు అని ఫారెన్స్‌ టూర్స్‌కి వెళ్తున్నారు గానీ, పెళ్లి మండపానికి మాత్రం కదలట్లేదు.

పెళ్లికి మెచ్యూరిటీ చాలా అవసరం అంటారు. అయితే మెచ్యూరిటీకి కూడా మెచ్యూరిటీ తెప్పించేంత వయసున్నా కొంతమంది బాలీవుడ్ బ్యూటీస్‌ మాత్రం పెళ్లికి దూరంగానే ఉంటున్నారు. హాఫ్‌ సెంచరీ కొడుతున్నా, పెళ్లి పీటలు మాత్రం ఎక్కట్లేదు. లవ్‌స్టోరీస్‌కి శుభం కార్డ్ వెయ్యలేకపోతున్నారు.మలైకా అరోరా లవర్‌ కోసం భర్తకి కూడా విడాకులు ఇచ్చింది. అర్జున్‌ కపూర్ కోసం అర్భాజ్ ఖాన్‌కి విడాకులు ఇచ్చి సింగిల్‌గా ఉంటోంది. హాలిడేస్ అనుకున్నప్పుడు అర్జున్ కపూర్‌తో కలిసి ఫారెన్ వెళ్తోంది. ఇక అర్జున్ కూడా మలైకా భర్తగా మారడానికి చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నాడు. కానీ మలైకా అరోరాకి 47 ఏళ్లు వచ్చినా, అర్జున్ 35 క్రాస్ చేసినా వీళ్లు మాత్రం పెళ్లి గురించి పట్టించుకోట్లేదు.

సుస్మితా సేన్ ప్రేమకి ఆమె ఇద్దరు కూతుర్లు కూడా ఓకే చెప్పారు. ఆల్రెడీ రోహమాన్ షాల్‌ని ఫాదర్‌లాగే ట్రీట్ చేస్తున్నారు. అయితే ఇంట్లో వాళ్లు ఒప్పుకున్నా సుస్మితా సేన్ మాత్రం పెళ్లి గురించి పెద్దగా పట్టించుకోట్లేదు. రోహమాన్ అన్నీ పక్కనపెట్టి సుస్మితా సేన్ ఇంట్లోనే ఉంటున్నా, లవర్‌ నుంచి భర్తగా ప్రమోషన్‌ ఇవ్వట్లేదు సుస్మిత.

 

TOP STORIES

రంజాన్ నెల ప్రారంభం.. విశేషాలు.. ప్రాముఖ్యత.. కొటేషన్లు..

రంజాన్ నెల ప్రారంభమైంది. ఈ సంవత్సరం ఏప్రిల 14వ తేదీ నుండి మే 12వరకు రంజాన్ నెల ఉంటుంది. పవిత్రమాసమైన ఈ నెలలో ముస్లింలందరూ భక్తిశ్రద్ధలతో...