ట్రెండ్ ఇన్: బాయ్‌కాట్ జెర్సీ..యూట్యూబ్‌లో ఒరిజినల్ ఫిల్మ్ చూడాలంటూ చురకలు

-

బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ నటించిన ‘జెర్సీ’ చిత్రం శుక్రవారం విడుదలైంది. తెలుగులో సూపర్ హిట్ అయిన స్పోర్ట్స్ డ్రామా ‘జెర్సీ’కి అఫీషియల్ హిందీ రీమేక్ ఈ పిక్చర్. కాగా, ఒరిజినల్ ను డైరెక్ట్ చేసిన దర్శకులు గౌతమ్ తిన్ననూరియే హిందీలోనూ దర్శకత్వం వహించారు.

ఈ సినిమా చూసిన పలువురు సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. షాహిద్ కపూర్ మాత్రమే ఈ పాత్ర పోషించగలరని, సినిమా ఒక ఎమోషనల్ జర్నీ అని కొనియాడుతున్నారు. ఇది ఒక వైపు కాగా, మరో వైపున మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ లో హిందీ ‘జెర్సీ’కి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు కొందరు నెటిజన్లు.#BoycottJersey బాయ్ కాట్ జెర్సీ హ్యాష్ ట్యాగ్‌తో వరుస ట్వీట్స్ చేస్తున్నారు. దాంతో సదరు హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండింగ్ లోకి వచ్చేసింది.

ఈ క్రమంలోనే బాలీవుడ్ నెపొటిజం, స్టార్ హీరోల వలన ఇబ్బందుల గురించి నెటిజన్లు రకరకాల పోస్టులు పెడుతున్నారు. ఒక పోస్టులో షాహిద్ కపూర్ ‘హైదర్’ సినిమాను ప్రస్తావించారు. సదరు చిత్రంలో షాహిద్ కపూర్..కశ్మీర్ లోని ‘మార్తాండ్ మందిరాన్ని’ సైతాన్ గుహగా అభివర్ణించారని ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోను షేర్ చేసి ట్వీట్ చేశారు. హిందూ సంస్కృతికి వ్యతిరేకంగా బాలీవుడ్ స్టార్ హీరోలు వ్యవహరిస్తూ ఆరోపిస్తూ ట్వీట్స్ చేస్తున్నారు.

బాలీవుడ్ యంగ్ హీరో దివంగత సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ను ఐఫా అవార్డ్స్ లో షారుఖ్ ఖాన్, షాహిద్ కపూర్ అవమానించారని, ఇప్పుడు వారిరువురికి తమ సత్తా ఏంటో చూపించాలని చెప్తూ పోస్టర్ ట్వీట్ చేశాడు ఓ నెటిజన్. #BoycottJersey హ్యాష్ ట్యాగ్‌తో పాటు CBI Make SSR Case A Priority అనే సెంటెన్స్‌ను కూడా నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. అనగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) సంస్థ బాలీవుడ్ యంగ్ హీరో దివంగత సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసును ప్రయారిటీగా గుర్తించి ఇన్వెస్టిగేట్ చేయాలని కోరుతున్నారు.

ఈ క్రమంలోనే కొందరు నెటిజన్లు ఇంకో అడుగు ముందుకేసి విమర్శలు చేస్తున్నారు. హిందీ జెర్సీ కంటే యూట్యూబ్ లోని తెలుగు టు హిందీ డబ్ అయిన ఒరిజినల్ ఫిల్మ్ ‘జెర్సీ’ చూడాలని చురకలు అంటిస్తున్నారు. సదరు చిత్రంలో నేచురల్ స్టార్ నాని, శ్రద్ధా శ్రీనాథ్ ల పర్ఫార్మెన్స్ బాగుంటుందని అంటున్నారు. మొత్తంగా #BoycottJersey హ్యాష్ ట్యాగ్ పేరిట ట్వీట్స్ చేస్తూనే ఉన్నారు.

https://twitter.com/search?q=%23BoycottJersey&src=trend_click&vertical=trends

Read more RELATED
Recommended to you

Exit mobile version