Brahmanandam: రెబ‌ల్ స్టార్ కు బ్ర‌హ్మీ స్వీట్ స‌ర్ ప్రైజ్! ఏం ఇచ్చాడో తెలుస్తే.. షాక్!

-

Brahmanandam: బ్రహ్మానందం.. ఆయనను చూడగానే ఎంత భాద‌లో ఉన్న మ‌నసు ప్ర‌శాంతంగా మారిపోతుంది. ఆయ‌న చూస్తేనే మ‌న ముఖంపై చిరునవ్వు చిగురిస్తుంది. త‌న హావాభావాల‌తో గిలిగింత‌లు పెట్ట‌డం ఆయ‌న‌కే చెల్లుతుంది. కేవ‌లం న‌టుడే కాద‌య‌న‌.. మంచి ఆర్టిస్టు కూడా పెన్సిల్ డ్రాయింగ్ చేయ‌డంతో ఆయ‌న దిట్ట‌. తెలుగు ఇండ‌స్ట్రీకి ఆయ‌న వ‌రం. ఆయ‌న వీలున్న‌ప్పుడ‌ల్లా డ్రాయింగ్స్ వేస్తూ.. త‌న స‌న్నిహితుల‌కు , సినీ ప్ర‌ముఖుల‌కు గిప్టులుగా ఇచ్చి స‌ర్ ప్రైజ్ చేస్తుంటారు.

ఇటీవ‌ల సీనియర్ నటుడు, గోపీకృష్ణ మూవీస్ అధినేత రెబల్ స్టార్ కృష్ణంరాజుకు ఆయ‌న స్వ‌యంగా వేసిన డ్రాయింగ్ ని ఇచ్చి.. స‌ర్ ప్రైజ్ చేశారు. ఆధ్యాత్మిక భావం ఉట్టి ప‌డేలా.. షిర్డీ సాయిబాబా పెన్సిల్ డ్రాయింగ్ ను ఫ్రేమ్ కట్టించి, కృష్ణంరాజు దంప‌తుల‌కు అందచేశారు. బ్రహ్మానందం బహుమతితో మురిసిపోయిన కృష్ణంరాజు ఆయనను శాలువతో సత్కరించారు. ఈ విష‌యాన్ని తెలుపుతూ.. రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఫొటోల‌ను పోస్ట్ చేశారు. ‘ఈ కామెడీ జీనియ‌స్.. ఆర్ట్ జీనియ‌స్ కూడా. ఆయ‌న‌కు అద్భుత‌మైన టాలెంట్ ఉంది. ఈ స్వీట్ స‌ర్‌ప్రైజ్ ఇచ్చినందుకు థ్యాంక్యూ.. గాడ్ బ్లస్ యూ బ్రహ్మానందం’ అని ఆశీర్వదించారు రెబల్ స్టార్!

గ‌తంలో బ్ర‌హ్మ‌నందం స్వ‌యంగా వెంకటేశ్వర స్వామి పెయింటింగ్ వేసి చిరంజీవి, రానా, అల్లు అర్జున్ వంటి హీరోలకు అందించిన విష‌యం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news