కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత వైద్యుల ఆవశ్యకత అందరికీ అర్థమైంది. 130కోట్ల భారతావనిలో వైద్యులు ఎంత తక్కువగా ఉన్నారో తెలిసింది. ప్రపంచానికి తాళం వేసిన సమయంలో పగలనకా, రాత్రనకా ప్రాణాలను పణంగా పెట్టి ఇతరుల ప్రాణాల కోసం పాటుపడిన వైద్యుల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. భారత వైద్య సంఘం తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం సెకండ్ వేవ్ లో 798మంది వైద్యులు తమ ప్రాణాలు కోల్పోయారు.
ఢిల్లీ 128, బీహార్ 115, ఉత్తరప్రదేశ్ 79, రాజస్తాన్ లో 44మంది వైద్యులు సెకండ్ వేవ్ ధాటికి నేలకొరిగారు. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లో అమరులైన వైద్యుల్లో 40, 37మంది ఉన్నారు. మొత్తం మీద కరోనా కాలంలో 1546మంది వైద్యులు ప్రాణాలు విడిచారని భారతీయ వైద్య సంఘం తెలియజేసింది. తమ ప్రాణాలను రిస్కులో పెట్టి మరీ వైద్యం అందిస్తున్న డాక్టర్ల మీద అడపా దడపా దాడులు జరగడం నిజంగా శోచనీయం.