BREAKING : రాహుల్ గాంధీ “భారత్ జోడో” యాత్రకు రెండు రోజులు బ్రేక్ పడనుంది. “భారత్ జోడో” యాత్ర చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ విశ్రాంతి తీసుకోనున్నారు. రాహుల్ గాంధీ “భారత్ జోడో” పాద యాత్ర కు ఈ రోజు, రేపు-రెండు రోజులు విరామం ఉండనుంది.
దసరా ఉత్సవాల సందర్భంగా కర్ణాటక రాష్ట్రంలోని కొడగు లో రాహుల్ గాంధీ రెండు రోజులు విశ్రాంతి తీసుకోనున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా కొడగులోనే బస చేయనున్నారు. మరలా అక్టోబరు 6 వ తేదీన ( గురువారం) రాహుల్ గాంధీ భారత్ జోడో పాద యాత్ర పునఃప్రారంభం కానుంది. ఇక ఇందులో భాగంగానే.. నిన్న సాయంత్రం.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కొడగు చేరుకున్నారు.
This is really delightful✨#BharatJodoYatra #RahulGandhipic.twitter.com/hYQfv3HnTX
— 𝓡𝓸𝓱𝓲𝓷𝓲 𝓐𝓷𝓪𝓷𝓭💕 (@miss_ronnie08) October 3, 2022