Breaking : సామాన్యుల‌కు బిగ్ షాక్.. భారీగా పెరిగిన గ్యాస్ ధ‌ర‌

-

సామాన్యుల‌కు మ‌రో బిగ్ షాక్ త‌గిలింది. ఇప్ప‌టికే పెట్రోల్ డిజిల్ ధ‌ర‌లు విప‌రీతంగా పెరుగుతున్నాయి. అలాగే ఈ రోజు బంగారం, వెండి ధ‌ర‌లు కూడా భారీగా పెరిగాయి. దీనికి తోడు నేడు గ్యాస్ ధ‌ర‌లు కూడా భారీగా పెరిగాయి. ఈ ఒక్క రోజే 19 కిలో గ్రాముల వాణిజ్య‌ గ్యాస్ ధ‌ర ఏకంగా రూ. 105 మేర పెరిగింది. దీంతో దేశ రాజ‌ధాని ఢిల్లీ న‌గ‌రంలో 19 కిలో గ్రాముల వాణిజ్య‌ గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర ఏకంగా రూ. 2012 కు చేరింది.

అలాగే 5 కిలో గ్రాముల వాణిజ్య గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర పై రూ. 27 వ‌ర‌కు పెరిగింది. కాగ గ్యాస్ ధ‌ర‌లు పెంచుతున్న‌ట్టు చ‌మురు సంస్థ‌లు ప్ర‌క‌టించాయి. ఈ పెరిగిన ధ‌ర‌లు కూడా నేటి నుంచే అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని చ‌మురు సంస్థ‌లు ప్ర‌క‌టించాయి. కాగ ఉక్రెయిన్ – ర‌ష్యా యుద్ధం కార‌ణంగా పెట్రోల్, డిజిల్ తో పాటు బంగారం, వెండి ధ‌ర‌లు పెరుగుతాయ‌ని మార్కెట్ నిపుణులు హెచ్చిరించారు. ముఖ్య‌మంగా గ్యాస్ ధ‌ర‌లు భారీగా పెరుగుతాయ‌ని అంచనా వేశారు.

Read more RELATED
Recommended to you

Latest news