బ్రేకింగ్; అధికారులకు కేసీఆర్ కీలక ఆదేశాలు…

-

కరోనా వైరస్ కట్టడిలో భాగంగా తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రోజు రోజుకి పదుల సంఖ్యలో కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో ఆయన అధికారులకు కీలక బాధ్యతలు అప్పగించారు. హైదరాబాద్, సూర్యాపేట, నల్గొండ, గద్వాల, నిజామాబాద్ జిల్లాలలో కరోనా వైరస్ కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వం ఇప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తుంది.

తాజాగా కేసీఆర్… ప్రగతి భవన్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర స్థాయి అధికారులు ఇక నుంచి క్షేత్ర స్థాయిలో పర్యటించాలని ఆయన ఆదేశించారు. కరోనా పై క్షేత్ర స్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితిని అర్ధం చేసుకోవాలని, పూర్తిగా పరిశీలించాలని ఆయన సూచించారు. వెంటనే పర్యటించాలని ఆయన ఆదేశించారు. రాష్ట్ర స్థాయి బృందంలో కీలక వ్యక్తులను ఆయన నియమించారు.

బృందంలో సిఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ఆరోగ్య శాఖ కార్యదర్శి, మెడికల్ డైరెక్టర్లను ఆయన నియమించారు. ప్రస్తుతం హైదరాబాద్ లో 400 పైగా కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు 850 దాటాయి. ఇప్పటికే పక్కా చర్యలను తీసుకుంటుంది. ఆస్పత్రుల సంఖ్యను కూడా పెంచారు. అటు వైద్య సదుపాయాలను కూడా పెంచుతూ వస్తుంది. అయినా సరే కరోనా ఆగడం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news