బ్రేకింగ్: ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… “ఆదిపురుష్” నుండి బిగ్ అప్డేట్… !

-

పాన్ ఇండియా హీరో ప్రభాస్ హిందీ డైరెక్టర్ తో చేస్తున్న పౌరాణిక కథాచిత్రం ఆధిపురుష్… ఇందులో రామాయణాన్ని ఇతివృత్తం గా తీసుకుని తెరకెక్కించిన ఈ సినిమాను ఓం రౌత్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రభాస్ రాముడిగా మరియు కృతిసనన్ సీతగా నటిస్తోంది. కాగా గత రెండు సంవత్సరాలుగా షూటింగ్ ను జరుపుకుంటున్న ఈ చిత్రం నుండి ఇప్పుడు బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా ట్రెయిలర్ కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ క్షణం రానే వచ్చింది, తాజాగా ఆదిపురుష టీమ్ మే 9 వ తేదీన ట్రెయిలర్ ను విడుదల చేయాలని ప్లాన్ చేసినా, దానికి ఒక రోజు ముందు రోజు 8 వ తేదీ రాత్రి కొన్ని థియేటర్ లలో విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటించింది. కాగా ఈ సినిమా జూన్ 16 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా హిట్ కావడం ప్రభాస్ కు చాలా అవసరం అని తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news