Breaking: రూ.25 కోట్ల విలువైన మరకత శివలింగం స్వాధీనం

-

చెన్నై పోలీసులు తమ సత్తా చాటారు. రూ.25 కోట్ల విలువైన పచ్చని రాతి మరకత శివలింగాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు చోరీకి పాల్పడిన ఇద్దరు వ్యక్తులకు అరెస్ట్ చేశారు. తమిళనాడులో భద్రపరిచిన విగ్రహాలను వెలికి తీసేందుకు విగ్రహాల చోరీ నిరోధక విభాగం పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. చెన్నై సమీపంలోని పూనమల్లి ప్రాంతంలో పాత మెటల్ నెక్లెస్‌తో కూడిన పచ్చని రాతి లింగాన్ని దాచిపెట్టినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు ఆ విగ్రహాన్ని అమ్మేందుకు రూ.25 కోట్లతో డీల్ మాట్లాడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బాల (46), బాకియరాజ్ (42) ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచనున్నారు.

green stone lingam

ఈ మరకత శివలింగం 29 సెం.మీ. ఎత్తు, 18 సెం.మీ. వెడల్పు కలిగి ఉంది. శివలింగం చుట్టు ఎగిరే ఉడతలు కనిపిస్తాయి. అలాగే దీని పీఠం పునాది సుమారు 28 సెం.మీ చుట్టుకొలత, 9,800 కిలోల బరువును కలిగి ఉంది. పచ్చని లింగం ఎత్తు సుమారు 7 సెం.మీ., 18 సెం.మీ. చుట్టుకొలతను కలిగి ఉందని అధికారులు వెల్లడించారు. ఈ విగ్రహం దాదాపు 500 ఏళ్ల నాటిదని, శివుడి ఐదు ముఖాల ఆయుధాలతో చెక్కబడిందని వారు పేర్కొన్నారు. విగ్రహ నిర్మాణ శైలి నేపాలీ శైలిని పోలి ఉందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version