టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తాజాగా పవన్ కళ్యాణ్ బిజెపితో సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇవాల్టి నుంచి రాష్ట్ర ముఖచిత్రం మారబోతుందని చెప్పిన ఆయన.. జనసేన లాంటి పార్టీ బిజెపిని రోడ్డు మ్యాప్ అడగడం ఎదుటని విమర్శలు వచ్చాయని.. ఎందుకో బీజేపీతో పొత్తు ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో కలిసి వెళ్లలేకపోతున్నామనిి అన్నారు.
ఈ విషయం బిజెపి రాష్ట్ర నాయకత్వానికి కూడా తెలుసని అన్నారు. బిజెపి నాయకత్వం అంటే గౌరవమే కానీ.. అలాగని ఊడిగం చేయలేము అని అన్నారు. వచ్చే ఎన్నికలు లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ఇప్పటినుంచే అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. మరోసారి టిడిపి తో పొత్తు పెట్టుకుంటారా.. అంటే అవుననే సంకేతాలే బలంగా వినిపిస్తున్నాయి. తాజాగా ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో భేటీ కావడంతో ఈ భేటీ పై ప్రాధాన్యత సంతరించుకుంది.