గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. టిడిపి అధికార ప్రతినిధి గంజి చిరంజీవి ఆ పార్టీకి రాజీనామా చేశారు. నారా లోకేష్ ప్రతినిత్యం వహిస్తున్న గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో కీలక నేత గంజి చిరంజీవి ఆ పార్టీకి రాజీనామా చేయడం తో ఇది మంగళగిరి నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. టిడిపిలో మున్సిపల్ చైర్మన్ గా, 2014లో ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు అంటూ ఆయన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
పార్టీలో బీసీగా ఉన్న తనను రాజకీయంగా ఇబ్బంది పెట్టారని.. 2014లో తన ఓటమికి సొంత పార్టీ నేతలే కారణమని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పదవుల కోసమో.. లేక పరపతి కోసమో టిడిపికి రాజీనామా చేయడం లేదని.. సొంత పార్టీ నేతల వెన్నుపోట్లు భరించలేకే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. లోకేష్ కోసమే ఒక పథకం ప్రకారం బీసీ సామాజిక వర్గానికి చెందిన తనను పక్కకు నెట్టారని అన్నారు.