BREAKING : సిక్సును ఆపబోయి గాయపడ్డ సూర్యకుమార్ యాదవ్ !

-

ముంబై ఇండియన్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ కు మధ్య జరుగుతున్న మ్యాచ్ లో ఇండియా స్టార్ బ్యాట్సమన్ సూర్యకుమార్ యాదవ్ కు గాయం తగిలింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్ చేస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ లో బెహ్రన్ డార్ఫ్ వేస్తున్న 17 వ ఓవర్ నాలుగవ బంతిని ఆపబోయిన సూర్యకుమార్ యాదవ్ కు ఎడమ కన్ను దగ్గర గాయం అయినట్లుగా తెలుస్తోంది.

అప్పటికే ఒక సిక్సర్ బాది మంచి ఊపుమీదున్న అక్షర్ పటేల్ మరో బంతిని సిక్సర్ గా మలచాలన్న ఉద్దేశ్యంతో భారీ షాట్ ఆడాడు. లాంగ్ ఆన్ లో ఫీల్డింగ్ చేస్తున్న సూర్యకు ఇది చాలా సులభమైన క్యాచ్ కానీ హెయిట్ ను సరిగా అంచనా వేయకుండా బంతిని పట్టుకోబోగా అది స్లిప్ అయ్యి సూర్య ఎడమకన్నుకు తగిలింది. మరి గాయం తీవ్రత గురించి ఇంకా తెలియాల్సి ఉంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news