పాలిచ్చే తల్లుల్లు కచ్చితంగా ఈ ఆహారపదార్దాలని తినాల్సిందే..!

-

పాలిచ్చే తల్లులు మంచి పోషకాహారం తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. చాలా మంది తల్లులు బిడ్డకి పాలు సరిపోక బాధపడుతూ ఉంటారు. వివిధ రకాల ఇంటి చిట్కాలని పాటిస్తూ ఉంటారు. పాలిచ్చే తలలు కచ్చితంగా ఈ ఆహార పదార్థాలు తీసుకుంటే చాలా బాగుంటుంది. మరి పాలు ఇచ్చే తల్లులు ఎటువంటి ఆహార పదార్థాలను తీసుకోవచ్చు అన్నది ఇప్పుడు చూద్దాం.

 

ఓట్స్:

పాలిచ్చే తల్లులు ఓట్స్ ని తీసుకుంటే పాల సరఫరా బాగుంటుంది. దీనిలో ఫైబర్, విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. షుగర్ లెవెల్స్ ని కూడా ఇది తగ్గిస్తుంది.

అవకాడో:

అవకాడో లో పోషక పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి పాలిచ్చే తల్లులకు ఆకలి ఎక్కువేస్తుంది అటువంటప్పుడు దీనిని తీసుకోవడం చాలా మంచిది.

నట్స్:

ఐరన్, క్యాల్షియం, జింక్ నట్స్ లో ఎక్కువగా ఉంటుంది. నట్స్ ని తీసుకుంటే కూడా ఆరోగ్యం చాలా బాగుంటుంది. పాలిచ్చే తల్లులకు ప్లస్ అవుతుంది.

పుట్టగొడుగులు:

పుట్టగొడుగులలో బీటా గ్లూకోన్ ఎక్కువగా ఉంటుంది పుట్టగొడుగుల్ని కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండండి.

ఆకుకూరలు:

ఆకుకూరలు ఎవరికైనా మంచి చేస్తాయి. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి ఆకుకూరలు చక్కటి ప్రయోజనాన్ని ఇస్తాయి. పాల ఉత్పత్తిని పెంచుతాయి. కాబట్టి వీటిని కూడా ఎక్కువగా డైట్ లో తీసుకుంటూ వుండండి.

క్యారెట్:

క్యారెట్ తినడం వలన పాలిచ్చే తల్లులు ఆరోగ్యంగా ఉండగలరు. పైగా ఇది పాల నాణ్యత ని కూడా పెంచేస్తుంది. కాబట్టి పాలిచ్చే తల్లులు వారి డైట్ లో చేర్చుకోవడం ఉత్తమం.

Read more RELATED
Recommended to you

Exit mobile version