రెచ్చిపోయి ప్రభుత్వాన్నీ, సీఎంని దూషిస్తున్నారు.. మూల్యం చెల్లిస్తారు : అంబటి

-

ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో భారీ ఊరట లభించింది. తనకు బెయిల్ కావాలంటూ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన ధర్మాసనం ఈ రోజు తీర్పు వెల్లడించింది. విచారణలో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ తీర్పును వెలువరించింది. ఈ నెల 30న ఏసీబీ కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. చంద్రబాబుకు బెయిల్ రాయడంతో టిడిపి నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటున్నారు.

Minister Ambati Rambabu Fires On Pawan Kalyan | Vaartha

ఇక, ఈ మొత్తం వ్యవహారంపై ఇవాళ ట్విట్టర్ వేదికగా మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు వచ్చింది బెయిల్ మాత్రమే.. ఆయనను నిర్ధోషి అని ప్రకటించలేదు అనే విషయం గుర్తు పెట్టుకోవాలని మంత్రి అంబటి రాంబాబు ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. కోర్టు ఇచ్చిన తీర్పును శిరసా వహించాల్సిన టీడీపీ నేతలు తమ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై, పార్టీపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే.. తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. అయితే, చంద్రబాబు నాయుడిపై ఏపీ సీఐడీ అధికారులు ఇప్పటికే 8 కేసులు న‌మోదు చేశారు. ప్రస్తుతం ఏపీ స్కిల్ స్కామ్ కేసుకు సంబంధించి మాత్రమే హైకోర్టు రెగ్యుల‌ర్ బెయిల్ ఇచ్చింది. కానీ, ఇదే కేసుకు సంబంధించి హైకోర్టు నిర్ణయాన్ని స‌వాల్ చేస్తూ చంద్రబాబు సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news